కస్టడీ లో మేం నమ్మి చేసిన ప్రతి యాక్షన్ సీన్ ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు :  అక్కినేని నాగ చైతన్య

కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కస్టడీ టీం

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ‘ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక  ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం  మే 12న  విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ, కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్‌ సీన్‌, పోలీస్‌ స్టేషన్‌ లో సింగిల్‌ షాట్‌ ఫైట్‌, ట్రైన్‌ ఫైట్‌, ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే ఓ సీన్‌ కు మంచి స్పందన వచ్చింది. రొటీన్‌ గా కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నం చేశాను. ఆదరిస్తున్న ఆడియన్స్‌ కు అభినందనలు తెలుపుతున్నా. మమ్మల్ని నమ్మి చేసిన నిర్మాత, దర్శకుల కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.

హీరోయిన్‌ కృతిశెట్టి మాట్లాడుతూ, దర్శకుడు వెంకట్‌ ప్రభు గారు నన్ను నమ్మి మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు థియేటర్‌ లో మంచి అప్లాజ్‌ వస్తుంది. నాగచైతన్య తో నటించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వెన్నెల కిశోర్‌, సంపత్‌ గారితో నటించడం ఆహ్లాదంగా ఉంది. కస్టడీ సినిమా హిట్‌ అయిందంటే అందుకు ఆడియన్స్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

ఆర్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ,  ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా వున్నాయి. పోలీస్‌ స్టేషన్‌ ఫైట్‌ గానీ, అండర్‌ వాటర్‌ సీన్‌ గానీ ఖర్చుపెట్టి నిర్మాత తీయించారు. అవి చాలా అద్భుతంగా దర్శకుడు తీశారు. థియేటర్‌ లో వాటికి మంచి స్పందన వస్తోంది అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ, తెలుగులో నేను చేసిన మొదటి సినిమా కి వస్తున్న గొప్ప ఆదరణకు థ్యాంక్స్‌ చెబుతున్నా. వందశాతం మా కష్టం ఫలించింది అనుకుంటున్నా. అంబులెన్స్‌ తో కంపేర్‌ చేస్తూ కొన్ని రివ్యూలు చూశాను. అలా వారు రాసినందుకు థ్యాంక్స్‌. యాక్షన్‌ ఫిలిం ఇది. యాక్షన్‌ పరంగా బాగున్నాయని రాశారు కూడా. 4 నిముషాల సింగిల్‌ షాట్‌ ఫైట్‌ ను మహేష్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ రిస్కీ షాట్‌ ను అవసరమైతే మరోసారి చేస్తాను అనికూడా నాగచైతన్య అన్నారు. ఆయన డెడికేషన్‌ నచ్చింది. కస్టడీ సినిమా ను తెలుగు, తమిళంలో కూడా బాగా ఆదరిస్తున్నారు. కుటుంబంతో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి అని కోరారు.

నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి మాట్లాడుతూ, కస్టడీ బ్లాక్‌ బస్టర్‌ అయినందుకు ఆనందంగా వుంది. కథలో ఏది నమ్మామో అది వర్కవుట్‌ అయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి   థ్యాంక్స్‌ చెబుతున్నాం అన్నారు.

Tfja Team

Recent Posts

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా…

10 hours ago

“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

12 hours ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

15 hours ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

1 day ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

1 day ago

మే 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నెక్ట్స్ మూవీ “సమ్మర్ హాలిడేస్”

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

1 day ago