వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

Must Read

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం.

ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా తన పంథాను మార్చుకొని ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను డైరెక్ట్ చేశారు. నలభై తొమ్మిది రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి.

ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్.

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ సంస్థ లో నిర్మాత కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News