టాలీవుడ్

కొంచెం హట్కే’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను

గురు చరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అవినాష్ కుమార్ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’. ఈ సినిమాకు కృష్ణ రావూరి కథను అందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.  ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా…

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసి చాలా నవ్వుకున్నాను. ఇంతలా నవ్వుకుని చాలా రోజులైంది. పదమూడేళ్ల క్రితం నేను కూడా చిన్న సినిమాను తీశాను. ఎవ్వరికీ అంతగా తెలియని ఆర్టిస్టులతో సినిమా తీశాను. మీడియా సహకారంతో ఆ సినిమా ఆడియెన్స్‌లోకి వెళ్లింది. ఈ మూవీని కూడా మీడియా అలానే ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అలా మొదలైంది టైంలో మా సినిమా ఈవెంట్‌కు గెస్టులుగా ఎవరిని పిలుద్దామని అనుకున్నాం. ఆ టైంలో కళ్యాణీ మాలిక్ వల్ల రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చారు. నేను ఓ దర్శకురాలిని అయితే.. ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్లాలని ఆ టైంలోనే ఫిక్స్ అయ్యాను. చిత్ర దర్శకుడు అవినాష్ విజన్ కనిపిస్తోంది. కృష్ణ రైటింగ్ బాగుంది. కేఎం రాధాకృష్ణ గారు ఈ సినిమా వెనకాల ఉండటం అదృష్టం. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు అవినాష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నందినీ రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకురాలు. కళాతపస్వీ విశ్వనాథ్ గారి వల్లే కొత్త కథ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని అనుకున్నాను. అందుకే టైటిల్ కూడా కొత్తగా పెట్టాం. ఇందులో హీరో హీరోయిన్లుండరు. పాత్రలే ఉంటాయి. వేరే వేరే ప్రపంచాల్లోంచి వచ్చిన మనుషులంతా కలిసి సినిమా తీసే కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. ఎంతో వినోదాత్మకంగా ఉండేలా సినిమాను తీశాం. మా చిత్రానికి మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.

రచయిత కృష్ణ రావూరి మాట్లాడుతూ.. ‘కష్టపడితే సక్సెస్ వచ్చిందని కొందరు, లక్ వల్లే సక్సెస్ వచ్చిందని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ టైం వల్లే అంతా జరుగుతుంది. అన్నీ కలిసి వస్తేనే సక్సెస్ వస్తుంది. కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం రాబోతోంది. బయటి ప్రపంచాన్ని చూస్తే కొత్త పాత్రలు, కొత్త కథలు వస్తాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. జనాల వరకు సినిమా వెళ్లేందుకు మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.

గురు చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మాధవ్ పాత్రను పోషించాను. నటుడిగా ఎదగాలనే ప్రయత్నాలు చేసే కారెక్టర్‌లో కనిపిస్తాను. సినిమాలో సినిమా తీయడం బాగుంటుంది. అందరినీ నవ్వించేలా ఈ మూవీ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో పాటలు థియేటర్లో బాగా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ మీ గ్రూపులతో ఈ సినిమాను చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అని అన్నారు.

కృష్ణ మంజూష మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నేను ప్రియాంక రెడ్డి పాత్రను పోషించాను. ఎంతో స్వేచ్చగా జీవించే కారెక్టర్‌లో కనిపిస్తాను. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటుంది. తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది బాగుంటుంది. సినిమా ట్రైలర్ చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా సహకారం అందించాల’ని కోరారు.

నటీనటులు గురు చరణ్, కృష్ణ మంజూష తదితరులు

బ్యానర్ :  అభిమాన థియేటర్ పిక్చర్స్
దర్శకత్వం : అవినాష్ కుమార్
నిర్మాణం : అభిమాన థియేటర్ పిక్చర్స్
రచయిత : కృష్ణ రావూరి
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్
ఎడిటర్ : మంజు కే రెడ్డి
కెమెరామెన్ : అనిల్ మల్లెల
లైన్ ప్రొడ్యూసర్ : నవ్య  పొట్ల
పీఆర్వో  : వంశీ కాకా

Tfja Team

Recent Posts

Hombale Films and Prabhas Sign Landmark A New Era For Indian Cinema

Hombale Films and Prabhas all set to join forces for three mega films, set to…

42 mins ago

“ఆస్ట్రిడ్ ” కు అల్లు అరవింద్ అభినందనలు

డెర్మటాలజీ అండ్ కాస్మటాలజీ పట్ల అవగాహన పెరుగుతున్న తరుణంలో అందుకు అవసరమైన అత్యాధునిక వసతులతో క్లినిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంజారాహిల్స్…

59 mins ago

నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్య రాజమౌళి

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు…

1 hour ago

Suriya Inspired Me to Make Pan-India Movies SS Rajamouli

Star hero Suriya is starring in the prestigious film Kanguva, a massive period action movie…

1 hour ago

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…

22 hours ago

” త్రిముఖ” జనవరి లో విడుదలకు సన్నాహాలు – హీరో యోగేష్ కల్లె

నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…

22 hours ago