నా ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను-రాఘవ లారెన్స్

నా ట్రస్ట్ కి దయచేసి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను..డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్లు చాలా మంది ఉన్నారు..ప్లీజ్ వారికి సాయం చేయండి: రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్… సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి అక్కడి నుంచి దర్శకుడు, నటుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపును సాధించారు. తను సంపాదించిన డబ్బుని కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలని కాకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. 60 మంది పిల్లలను పెంచటంతో పాటు వికలాంగులకు డాన్స్ నేర్పించటం, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం, గుండె ఆపరేషన్స్ చేయించటం క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వకండిని రిక్వెస్ట్ చేశారు. అలా చెప్పటానికి గల కారణమేంటనే దానిపై లారెన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ..”నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను.

అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది.

నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ” అన్నారు.

‘చంద్ర ముఖి 2’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. ఈ డబ్బుతో పాటు తను కూడా కొంత డబ్బు వేసుకుని ఓ స్థలం కొని అందులో సుభాస్కరన్ తల్లి పేరు మీద బిల్డింగ్ కడతానని అన్నారు. తన స్టూడెంట్స్ ఆ బిల్డింగ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారని లారెన్స్ పేర్కొన్నారు.

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago