టాలీవుడ్

బేబీ థర్డ్ సింగిల్ నాకు ఎంతో బాగా నచ్చింది.. రష్మిక

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు.

ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న చేతుల మీదుగా విడుదల చేయించి చిత్రయూనిట్. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

మారుతి మాట్లాడుతూ.. ‘ఒక్కో పాట, ఒక్కో ప్రమోషన్ జనాల్లోకి రీచ్ అవుతోంది. ఒక్కో పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోందంటే చాలా గొప్ప విషయం. ఆర్గానిక్ లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి గొప్ప కంటెంట్‌ను సాయి రాజేష్‌ తీశారు. టీం అంతా కూడా ఎంతో కష్టపడుతోంది. ఈ టీం కోసం పాటను రిలీజ్ చేసేందుకు వచ్చిన రష్మిక గారికి థాంక్స్’ అని అన్నారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ప్రత్యేక ఈవెంట్. కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన 25వ ఈవెంట్ ఇది. రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాట, ఒక్కో పోస్టర్‌ను ఎంతో క్రియేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కలెక్షన్ల గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. ‘రష్మిక లాంటి స్టార్‌లు ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. మంచి పాట.. మంచి సింగర్లను కోరుకుంటుంది. గెలుపు తలుపులే పాట లాంటిది మళ్లీ ఎందుకు పాడలేదని శ్రీరామచంద్ర గురించి అనుకుంటూ ఉండేవాడిని. రోహిత్‌ చాలా టాలెంటెడ్ సింగర్. ఇప్పుడు ఆయనకు సరైన టైం వచ్చింది. లిరిక్ రైటర్ సురేష్‌ ఎంతో చక్కగా పాటను రాశారు. బేబీలో మూడు పాటలు రాశారు. ప్రమోషన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న మా ఎస్‌కేఎన్, మారుతి గారికి థాంక్స్. కచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయబోతోన్నాం’ అని అన్నారు.

రష్మిక మందాన్న మాట్లాడుతూ.. ‘ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు నేను ఫ్యాన్. బేబీ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్’ అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..మా సినిమా జూలైలో రాబోతోంది. ఇంతే ప్రేమను థియేటర్లో కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీసేందుకు పగలు రాత్రి కష్టపడుతున్నాం. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. సినిమా రిలీజ్ అయిన తరువాత అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో నాకు ఎంతో ఇష్టం. ఇంత బిజీగా ఉన్నా మారుతి గారు మాకోసం వచ్చినందుకు థాంక్స్. ఎస్‌కేఎన్ గారు ఇది చిన్న సినిమా అని కాకుండా.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సినిమాలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ పాటను వింటాం. విరాజ్, వైష్ణవిలకు థాంక్స్. బేబీ సినిమా అందరికీ నచ్చతుంది’ అని అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ రావడానికి కారణం విజయ్ బుల్గానిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాట విని అప్పుడే ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ టాలెంట్‌ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్ అయ్యాయ’ని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇందులో నేను కనిపిస్తున్నాను. గతంలో రిలీజ్ చేసిన రెండు పాటలను హిట్ చేశారు. ఈ మూడో పాటను కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. నా మొదటి సినిమా రిలీజ్ టైంలోనూ రష్మిక ట్వీట్ వేశారు. మా పాటను రిలీజ్ చేసిన రష్మిక గారికి థాంక్స్. లిరిక్ రైటర్ సురేష్‌ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, సింగర్ రోహిత్‌ గారు ఈ రోజు మా హీరోలు’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను చేశాం. ఇది మా అందరికీ ఎంతో స్పెషల్. ఎంతో నమ్మకంగా ఈ సినిమాకు పని చేశాం. ఇది కచ్చితంగా మీ అందరి హృదయాలను దోచేస్తుంది. ఈ మూడో పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిక్ రైటర్ సురేష్ మాట్లాడుతూ.. ఈ పాట నా కెరీర్‌లో మలుపుతిప్పుతుందని ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్ మూవీ మేకర్స్‌కు, విజయ్ బుల్గానిన్‌లకు థాంక్స్’ అని అన్నారు.

ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ.. ‘ఈ పాటకు పదింతల ఎమోషన్స్ సినిమాలో ఉంటుంది. సినిమా త్వరలోనే రాబోతోంది. ఎదురుచూస్తూ ఉండండి’ అని అన్నారు.

సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. ‘నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన సాయి రాజేష్‌ గారికి థాంక్స్. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసి నాకు ఈ సాంగ్ ఇచ్చారు. గెలుపు తలుపులే పాట పాడారు కదా?.. ఆ పాటకు నేను ఫ్యాన్ అని సాయి రాజేష్ గారు అన్నారు. మళ్లీ ఆ స్థాయిలో నాకు పేరు తెచ్చే పాట అవుతుంది. ఆనంద్, విరాజ్, వైష్ణవి, ఎస్‌కేఎన్‌లకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సింగర్ రోహిత్ మాట్లాడుతూ.. ‘మంచి పాట పాడి నీ పేరు నిలబెడతాను అని మా అమ్మకు మాటిచ్చాను. ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ పాట ఆడియెన్స్ అందరికీ నచ్చాక మళ్లీ మాట్లాడతాను’ అని అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ రెండు సాంగ్స్ పెద్ద హిట్ చేశారు. సాయి రాజేష్ గారు మంచి సందర్భాన్ని క్రియేట్ చేయడం వల్లే ఇంత మంచి పాటలు వచ్చాయి. మా అందరినీ ఎస్‌కేఎన్ గారు నమ్మారు. సురేష్‌ గారు మంచి లిరిక్స్ రాశారు. అందరూ పాటను చక్కగా పాడారు. మారుతి గారికి థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

15 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago