బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: ‘అహింస’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి
*జూన్ 2న అహింసతో మళ్ళీ పుడుతున్నాను : అభిరామ్
*రామానాయుడు గారి కోసం అహింస సినిమా చేశాను: డైరెక్టర్ తేజ
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమ కథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. చీరాలకు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ రోజు మేమ్ ఏం చేసినా, ఎంత దూరం వెళ్ళినా అది మా తాతగారు వేసిన ఫ్లాట్ ఫాం. తేజ గారు ఆయనకి నచ్చిన వ్యక్తులతోనే సినిమా చేస్తారు. నాకు ,ఆయనకు వున్న సింక్ ఏ డైరెక్టర్ యాక్టర్ కి ఉండదు. ఆయనతో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నన్ను నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఒక రీజనబుల్ గుడ్ లుకింగ్ ఫెలో నుంచి యాక్టర్ గా చేసింది డైరెక్టర్ తేజ గారే. అలాంటి దర్శకుడి చేతిలో మా తమ్మడు లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. అభి.. ఆల్ ది వెరీ బెస్ట్. బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో లాంచ్ అవుతున్న నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. తేజ గారు ఆర్పీ గారి కాంబినేషన్ ని మళ్ళీ చూడటం ఆనందంగా వుంది. మా బ్రదర్ ని లాంచ్ చేస్తున్న నిర్మాత కిరణ్ గారికి థాంక్స్. జూన్ 2 సినిమా విడుదలవుతుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ తెలిపారు
అభిరామ్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారి అభిమానులకు, రానా ఫ్యాన్స్ కి.. అందరికీ కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి తాతతో చాలా సెట్స్ లో తిరిగాను. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. నన్ను హీరోగా చూడాలనేది తాత గారి కోరిక. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ వుంటాయి. తేజ గారు ఈ సినిమాతో నన్ను లాంచ్ చేశారు. ఎంతోమంది హీరోలకు ఆయన లైఫ్ ఇచ్చారు. నాకు కూడా ఒక లైఫ్ ఇచ్చారు. దాన్ని ఫుల్ ఫిల్ చేసుకుంటానని చెబుతున్నాను. కిరణ్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తేజ గారు ఆర్పీ గారి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. నాన్న, అమ్మా, బాబాయ్, అన్న.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళే నా పిల్లర్స్. జూన్ 6 తాతగారి బర్త్ డే. జూన్ 2న అహింస తో మళ్ళీ నేను పుడుతున్నాను. ఆయన బర్త్ డే మంత్ లో నా సినిమా విడుదలౌతుంది. తాత నా పక్కనే ఉంటారు. ఈ సినిమాతో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ తాత. ఐ లవ్ యూ’’ అన్నారు
తేజ మాట్లాడుతూ..నేను రకరకాల మందిని పరిచయం చేశాను. అభిరాంనే ఎందుకు పరిచయం చేయాలి ? అభిరాం వాళ్ళకే సొంత నిర్మాణ సంస్థ ఉంది. వాళ్ళే చేసుకోవచ్చు. కానీ దీనికి కారణం రామానాయుడు గారు ఉన్నప్పుడు మా మనవడితో సినిమా చేయాలని అడిగారు. చేస్తానని చెప్పాను. తర్వాత ఆయన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. కొన్నిరోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ పట్టుకుంది. అంత పెద్ద మనిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మాట తప్పాననే గిల్ట్ ఉండిపోయింది. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. సురేష్ గారికి చెబితే ఆయన పెద్ద ఆసక్తి చూపలేదు. తర్వాత సరే అన్నారు. ఈ సినిమా రామానాయుడు గారి గురించి చేశాను. అంతకుముందు రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాను. మళ్ళీ రానా గారితో సినిమా చేయబోతున్నా. ఈ సినిమాకి రాక్షస రాజు అనే పేరు అనుకుంటున్నాను. అహింస తో అభిరాం, గీతిక పరిచయం అవుతున్నారు. ఇద్దరిని చాలా కష్ట పెట్టా. నా దెబ్బకి సగం అయిపోయారు(నవ్వుతూ) చీరాలలో ఈ వేడుక జరగడం ఆనందంగా వుంది’’ అన్నారు.
గీతికా మాట్లాడుతూ.. ఈ రోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం తేజ గారు. ఆయనకి పాదాభివందనం. కిరణ్ గారికి, సురేష్ గారికి కృతజ్ఞతలు. జూన్ 2న అందరూ సినిమా చూడండి’’ అని కోరారు
ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ…రామానాయుడు గారితో మాకు ఎంతో అనుబంధం వుంది. రామానాయుడు గారి కుటుంబం ఇచ్చిన డొనేషన్స్ తో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభి హీరోగా పరిచయం కావడం ఆనందంగా వుంది. అభి భవిష్యత్తు బాగుండాలి. మీ అందరి ఆశీస్సులు అభి పై వుండాలి’’ అని కోరారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. అభిని నటుడిగా చూడటం మా నాన్నగారి కోరిక. నేను ఆయనకి మాటిచ్చాను. అభితో నేను సినిమా తీస్తున్నాను’’ అని తేజ చెప్పారు. నటుడు కావాలనేది అభి డ్రీమ్. ఆ డ్రీమ్ కిరణ్ తేజ వలన తీరింది. ఈ వేడుక చీరాలలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ వూరిలో చాలా జ్ఞాపకాలు వున్నాయి. ఎమ్మెల్యే బలరాం గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు
శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రామానాయుడు గారు మా కుటుంబానికి ఆప్తులు. నాకు గురు సమానులు. సినిమా అంటే ఆయనకి ప్రాణం, ఊపిరి. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసిన మూవీ మొఘల్. సురేష్ బాబు, వెంకటేష్ బాబు లని కూడా సినిమాల్లో ప్రోత్సహించారు. తర్వాత మూడో జనరేషన్ కోసం ఎదురు చూశారు. రానా ని పరిచయం చేశారు. అభిని కూడా నటుడ్ని చేయాలనే కోరిక ఆయనకి ఉండేది. ఆ కల ఈ రోజు నిజం కావడం ఆనందంగా వుంది. తేజ చాలా విలక్షణమైన దర్శకుడు. ప్రతిభను గుర్తించి బయటికి తీసుకు వచ్చే దర్శకుడు. రామానాయుడు గారు అభిని ఆశీర్వదిస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. అభిరాం ని పరిచయం చేస్తూ తేజగారు, ఆనంది ఆర్ట్స్, మేము అందరం కలసి చేసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మళ్ళీ జయం స్టైల్ లో పవర్ ప్యాక్డ్ సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అభి చాలా కష్టపడ్డాడు. తన కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తేజ గారి చేతిలో కొత్త వాళ్ళు ఆణిముత్యాలు అవుతారు. ఆ వరుసలో అభి కూడా ఓ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. నువ్వు నేను సినిమాకి కీబోర్డ్ ప్లేయర్ గా చేశాను. ఇప్పుడు అహింసకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. తేజ గారికి కృతజ్ఞతలు. తేజ గారి స్టైల్ సినిమా ఇది. అభి ఈ చిత్రంతో పెద్ద స్టార్ అవుతారు.
మనోజ్ టైగర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా భోజ్ పురి సినిమాని రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు అభిరాం సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారిని, రానా గారిని ఎలా ఐతే ప్రేమించారు అలాంటి ప్రేమ అభిమానం అభిరాంకి ఇవ్వాలి” అని కోరారు
కమల్ కామరాజు మాట్లాడుతూ.. తేజ గారి లాంటి దర్శకులతో పని చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. తేజ గారి నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ చేశాను. ఈ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్ట్ లు బయటికి వస్తారు. అభిరాం అద్భుతంగా చేశారు. థియేటర్ లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు
రజిత్ బేడి మాట్లాడుతూ .. బాలీవుడ్ లో దాదాపు 50 సినిమాలకు పైగా చేశాను. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన తేజ గారికి కృతజ్ఞతలు. నిర్మాత కిరణ్ గారి థాంక్స్. మీ అందరి ఆశీస్సులు కావాలి” అన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్…
Young and dynamic actor Nikhil Siddhartha is all set to impress with his upcoming film…
Popular production house Sri Venkateswara Creations, known for blockbuster films, is now bringing an entertainer…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన…
Lucky Baskhar starring multi-lingual star actor Dulquer Salmaan, Meenakshi Chaudhary, Sai Kumar, Tinnu Anand, Sharad…