కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం-హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. ఇది కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.  

కాంతలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏం అనిపించింది?
-కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఫుల్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. దుల్కర్ గారు రానా గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది.

– న్యూ కమ్మర్ కి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం. ఒక  ఛాలెంజ్ గా ఈ క్యారెక్టర్ ని తీసుకున్నాను. కుమారి క్యారెక్టర్ కి ఏం కావాలో గ్రౌండ్ వర్క్ చేశాను. 1960 టైమ్స్ ని రీ క్రియేట్ చేయాలి. అది చాలా టఫ్ జాబ్. ఈ సినిమా కోసం పాత తెలుగు తమిళ్ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు సావిత్రి గారి నటన గమనించాను. వాటన్నిటినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని కుమారిని కొత్తగా రీక్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది.  

మీరు ఫస్ట్ సైన్ చేసిన సినిమా ఇదేనా?
-నేను ఫస్ట్  కాంత కథనే విన్నాను. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ గ్యాప్ లో వేరే రెండు సినిమాలు చేయడం జరిగింది. టెక్నికల్ గా నేను ఫస్ట్ సైన్స్ చేసిన కథ కాంతనే.

ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
-షూటింగ్ అంతా చాలా పాజిటివ్ గా జరిగింది. అందరం ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. ఇది నేను 2023లో విన్న కథ అప్పటి నుంచి మాకు జర్నీ ఉంది. చాలా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్యూర్ పెర్ఫార్మెన్స్  ఓరియెంటెడ్ క్యారెక్టర్. ఒక న్యూ కమ్మర్ కి ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు.

రానా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రానా గారికి సినిమా అంటే చాలా పాషన్. ఆయన ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతారు. ఆయన సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు.  ఒక యాక్టర్ గా రానా గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన గ్రేట్ పెర్ఫార్మర్.

డైరెక్టర్ సెల్వ గారి గురించి?
-డైరెక్టర్ సెల్వ గారు చాలా టాలెంటెడ్. చాలా మంచి మనిషి. ఆయన మంచితనం ఆయన రైటింగ్ లో కూడా కనిపిస్తుంది. కుమారి క్యారెక్టర్ ని ఆయన రాసుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి యాక్టర్స్ నుంచి చాలా మంచి పెర్ఫార్మెన్స్ లో తీసుకున్నారు.

రవితేజ గారు విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారితో వర్క్ చేశారు .. ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?
-కెరీర్ బిగినింగ్ లోనే ఇంత మంచి స్టార్స్ తో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. అందరూ కూడా నా పట్ల ఎంతో కైండ్ గా ఉన్నారు.

కాంత, ఆంధ్ర కింగ్ వరుసగా వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుంది?
చాలా ఎక్సయిట్ గా వుంది.. అదే టైంలో నెర్వస్ గా కూడా ఉంది. నా వరకు 100% ఇచ్చాను . తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందని నమ్ముతున్నాను

కాంత సినిమా నుంచి ఒక యాక్టర్ గా మీరు ఏమి ఆశిస్తున్నారు?
-ఇప్పటివరకు ఒక కమర్షియల్ పెర్ఫార్మర్ అన్నారు. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీని ఒక పర్ఫార్మర్ కూడా అంటారని ఆశిస్తున్నాను. ఈ సినిమా నాకు నటించే అవకాశాన్ని ఇచ్చింది.  

నిర్మాతలు  గురించి ?
రానా గారు, దుల్కర్ గారు అద్భుతమైన నటులే కాదు.. సినిమా అంటే పాషన్ వున్న నిర్మాతలు కూడా. మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే తపనతో వుంటారు. వారి పాషన్ తో సినిమాని చాలా గ్రాండ్ గా తీశారు. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వున్న సినిమా కాంత.    

సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?
ఇందులో డాన్సింగ్ సాంగ్ నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది.

మీకు ఇష్టమైన జానర్?
నాకు యాక్షన్ రొమాన్స్ అన్ని జోన్స్ ఇష్టమే. అన్ని రకాల పాత్రలు చేయాలనే ఉంటుంది.

కాంతతో తమిళ్ లో కూడా పరిచయం అవుతున్నారు.. భవిష్యత్తులో అక్కడ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందా?
– ఒక ఆర్టిస్ట్ కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మంచి స్క్రిప్ట్స్ ఉంటే చేస్తాను. అయితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాకే.  

కొత్త సినిమాలు గురించి?
-తెలుగు సినిమాలు, అలాగే హిందీ సినిమాలు ఉన్నాయి.  ప్రాజెక్ట్స్ గురించి మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

కాంత, ఆంధ్ర కింగ్ ఈ రెండు కూడా సినిమాతో ముడి పడిన కథలు కదా.. ఎలా అనిపిస్తుంది?
-కాంతలో సినిమాలో సినిమా ఉంటుంది. ఆంధ్ర కింగ్ ఒక ఫ్యాన్ బయోపిక్. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్ సినిమాలు.  కాంతలో కుమారి క్యారెక్టర్ కి ఆంధ్ర కింగ్ లో మహాలక్ష్మి క్యారెక్టర్ కి అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. రెండు సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయని నమ్ముతున్నాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Tfja Team

Recent Posts

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago

“అరుణాచల గిరి ప్రదక్షిణ”ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించినప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…

2 days ago