‘బచ్చలమల్లి’ లో వెరీ మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. అమృత అయ్యర్

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బచ్చలమల్లి ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-హనుమాన్ షూట్ చేస్తున్నపుడు ఈ కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ వుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-80sలో బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. టౌన్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ వున్న క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.

నరేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

హనుమాన్ తర్వాత మీ కథ ఎంపిక ఎలాంటి మార్పు వచ్చింది ?
-మొదటి నుంచి మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది.

డైరెక్టర్ సుబ్బు గారి గురించి ?
సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా వుంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

బచ్చలమల్లి మ్యూజిక్ గురించి ?
-సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా మ్యూజిక్. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా కనెక్ట్ అవుతాయి.

నిర్మాతల గురించి ?
-రాజేష్ దండా గారితో ఇదివరకే ఓ సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంటే చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. వారి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఈ మూవీ జర్నీ చాలా స్మూత్ గా జరిగింది.

మీకు డ్రీం రోల్స్ ఏమిటి ?
-డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ రోల్స్ చేయాలని వుంది. యాక్షన్ రోల్స్ చేయడం కూడా ఇష్టమే. (నవ్వుతూ)

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
-ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

9 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago