YRF నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్ 2’ నుంచి హృతిక్ రోషన్, కియారా అద్వానీ రొమాంటిక్ సింగిల్ ‘ఊపిరి ఊయలలాగా’ విడుదల*

Must Read

*YRF నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్ 2’ నుంచి హృతిక్ రోషన్, కియారా అద్వానీ రొమాంటిక్ సింగిల్ ‘ఊపిరి ఊయలలాగా’ విడుదల* యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’ నుంచి మొదటి ట్రాక్‌ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ‘ ఊపిరి ఊయలలాగా’ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “బ్రహ్మాస్త్ర”లోని బ్లాక్‌బస్టర్ పాట ‘కేసరియా’ పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా అంటువ్యాధి కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఆదిత్య చోప్రా నిర్మించిన “వార్ 2” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Latest News

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా...

More News