హిట్ టాక్ తో థియేటర్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “హనీమూన్ ఎక్స్ ప్రెస్:

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయి.

“హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన ‌పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట కొత్తదనం అందిస్తోంది. ద్వితీయార్థంలో వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీలకంగా ఉండి ఆకట్టుకుంటోంది.

దర్శకుడు బాలరాజశేఖరుని ఓ మంచి సినిమా చేస్తాడనే నమ్మకం తో “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి స్టార్స్ ప్రమోట్ చేశారు. వారి నమ్మకం ఆడియన్స్ ఆదరణతో నిజమవడం పట్ల మూవీ టీమ్ హ్యాపీగా ఉన్నారు. “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.

నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
డిస్ట్రిబ్యూటర్లు: సుచిన్ సినిమాస్.
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago