అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాకు మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పాటలు, టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చింది. టీజర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 21న ఈ సినిమా థియేటర్లో వస్తోంది. అందరూ తప్పక చూడండి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. బిగ్ బెన్ స్టూడియోస్ నా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. బిగ్ బెన్ స్టూడియోస్ వల్లే పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది. యశ్ మామకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
యశ్ రంగినేని మాట్లాడుతూ.. ‘విజయ్ ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్‌ను సపోర్ట్ చేసినందుకు థాంక్స్. రెట్రో ఫీలింగ్‌ను తీసుకు రావాలనే ఇలాంటి బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నాం. మంచి సంగీతం ఈ సినిమాకు లభించింది. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ నిర్ణయిస్తారు. ఈ సినిమాను చూసి ప్రేక్షకుల తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ప్రథమార్థం అంతా కూడా ఎంతో ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. జూలై 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పక చూడండి’ అని అన్నారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫన్‌గా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులుంటాయి. సంక్రాంతి హాలీడేలకు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. ఈ జూలై 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి’ అని అన్నారు.
చైతన్య రావ్ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మాలాంటి వాళ్లకు స్పూర్తి. నా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్‌కు థాంక్స్. పెళ్లి చూపులు సినిమాను థియేటర్లో చూశాను. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతతోనే పని చేస్తున్నాను. 80, 90ల నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేయాలని ఈ సినిమాను తీశాం. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. సంగీతం బాగుంటుంది. జూలై 21న ఈ సినిమా రాబోతోంది. అందరూ తప్పక చూడండి’ అని అన్నారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు విజయ్ దేవరకొండ గారికి థాంక్స్. ఇప్పటికే పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. జూలై 21న మా చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…