
శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’
చార్లీ చాప్లిన్ గెటప్ లో సుధాకర్ కోమాకుల.. ‘SI యుగంధర్’ ఫేమ్ రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరాకెక్కబోతోంది
మనర్తి విఘ్నేష్ నిర్మాతగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’. సుఖ మీడియా అనుసంధానంతో, బన్సారీ ఫిల్మ్స్ సౌజన్యంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
తనదైన నటనతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల ఈ చిత్రంలో ఒక కీలకమైన, ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితమైన దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా, హైలైట్‌గా నిలవనుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ప్రత్యేకమైన పాత్ర కోసం సుధాకర్ కోమాకుల ఎంతో హోంవర్క్ చేయడంతో పాటు, చార్లీ చాప్లిన్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్‌ను ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్న ‘SI యుగంధర్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర కటారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఒక మంచి, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు. ‘Life Is a Dramedy’ (జీవితమే ఒక డ్రామెడీ) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ కథ ముందుకు సాగుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, అనుకోని మలుపులు.. ఇలా డ్రామా, కామెడీ, భావోద్వేగాల కలయికే జీవితం అనే సందేశాన్ని ఈ చిత్రం ఆవిష్కరించబోతోంది.
ప్రస్తుత జెన్ జీ (Gen Z) తరానికి చార్లీ చాప్లిన్ పేరు వినగానే గుర్తుకొచ్చేది నవ్వులు, వినోదం, మరపురాని హాస్య సన్నివేశాలు. అయితే ఈ సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా, చార్లీ చాప్లిన్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఒక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లను, కష్టాల మధ్య కూడా జీవితాన్ని ప్రేమించాలనే స్ఫూర్తిని ఈ కథలో చూపించబోతున్నారు.
ఒక సరికొత్త కథాంశంతో, విభిన్నమైన పాత్రలతో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
వినోదం, భావోద్వేగం, స్ఫూర్తి కలగలిసిన ఒక సరికొత్త సినీ ప్రయాణానికి ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ సిద్ధమవుతోంది!
నిర్మాత: మనర్తి విఘ్నేష్
బ్యానర్: శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్
అనుసంధానం: సుఖ మీడియా
సౌజన్యం: బన్సారీ ఫిల్మ్స్
దర్శకత్వం: రాఘవేంద్ర కటారి
ప్రధాన పాత్ర: సుధాకర్ కోమాకుల
పోస్టర్: విన్సి రాజ్
పెయింటింగ్ : కార్ల జి ఒటనెజ్

