హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం సర్దార్ తెలుగు, తమిళంలో బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల రన్ లో అసాధారణమైన బిజినెస్ సాధించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా ఈ సినిమాలోని ప్రముఖ తారాగణం.సర్దార్ పార్ట్ 2 చేయడానికి టీమ్ హింట్స్ఇచ్చింది. ఈరోజు టీమ్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. సర్దార్ సీక్వెల్ ఉంటుంది, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.కార్తీ పోషించిన సర్దార్ కొడుకు పాత్రను రా ఏజెంట్‌గా చేరమని ఆఫర్ చేయగా అతను అంగీకరించాడు.
నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోంది. సర్దార్ కోసం పనిచేసిన అదే టీమ్ సర్దార్ 2కి కూడా అసోసియేట్ అవుతుంది.సర్దార్ లో కార్తి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తి విలక్షణమైన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుని ఆకట్టుకుంది. దర్శకుడు మిత్రన్ బ్రిలియంట్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రానున్న ఈ సీక్వెల్ క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రేక్షకులని అలరించబోతుంది.జార్జ్ సి విలియమ్స్ కెమెరా మెన్ గా పని చేయగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…