‘హిడింబ’ హీరో అశ్విన్ బాబు  ఇంటర్వ్యూ

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రిమియర్స్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో అశ్విన్ బాబు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమాకి ‘హిడింబ’ అనే పేరు పెట్టడానికి కారణం ?
వాస్తవానికైతే ఈ కథకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ కావాలి. కానీ ఐప్పటికే  ఈ పేరుతో సినిమాలు వచ్చాయి. ఆ స్థానంలో మరో పేరు కోసం అన్వేషించినపుడు ‘హిడింబ’ అనే పేరు ఐతే బావుంటుదని భావించాం. దీని అర్ధం కూడా రాక్షసుడు అనే అర్ధానికి దగ్గరగా వుంటుంది. దీనికి చారిత్రక నేపథ్యం కూడా వుంది. సినిమాలో ప్రేక్షకులని యంగేజ్ చేస్తాం, సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇద్దామనే దృష్టితోనే ఈ కథని యాక్సెప్ట్ చేశాను. నిన్న వేసిన ప్రిమియర్స్ కి  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన అందరూ చాలా బావుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది.

డైరెక్టర్ అనిల్ గారు ఈ కథతో ఎప్పుడు సంప్రదించారు ?
కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత కాల్ లోనే ఈ కథ చెప్పారు.  చాలా నచ్చింది. ఐతే అప్పటికే మా నిర్మాత శ్రీధర్ గారితో ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ అనుకున్నాం. కానీ కరోనా కారణంగా స్టేడియమ్స్ పర్మిషన్స్, అలాగే ఫారిన్ లొకేషన్స్ కుదురుతాయా లేదా ? అనే సందేహం వుండేది. అందరం ఒకే అభిప్రాయానికి వచ్చి ‘హిడింబ’ కథ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఈ సినిమా చేసే క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?
ముందుగా ఈ సినిమా నిర్మాత గంగపట్నం శ్రీధర్ గారి గురించి చెప్పాలి. హీరోకి చాలా ప్రధానత్య ఇచ్చే నిర్మాత ఆయన. ఆయనకి ఏది అడిగినా .. ‘ హీరో గారు కావాలంటే ఇచ్చేయండి, హీరో గారిని అడగండి’  ఇలా ఆయన అనడంతో నాపై తెలియకుండానే ఒక బరువు, బాధ్యత పెరిగింది. ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయనకి విజయం దక్కాలని ప్రతి క్షణం కోరుకున్నాను. ఈ సినిమాని ఆయన అత్యున్నతంగా నిర్మించారు. అలాగే ఓంకార్ అన్నయ్య ఏది చేసిన కొత్తగా చెయ్ అని చెబుతుంటారు. ఈ రెండు ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశా. అందుకే ఈ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా ఒప్పుకోలేదు.

మీరు ఎక్కువగా హారర్ , థ్రిల్లర్స్ చేస్తారు .. ఆ జోనర్స్ మీకు ఇష్టమా ?
రాజు గారి గది ఫ్రాంచైజ్ గాని మీరు పరిశీలిస్తే అందులో నేను చేసిన పాత్రలు దేనికవి డిఫరెంట్ గా వుంటాయి. పాత్రలో వైవిధ్యం ఉంటేనే చేస్తాను. హిడింబలో చూస్తే నా ముందు సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త వేరియేషన్ చూస్తారు. నలుగురుని కొట్టినా నమ్మొచ్చు అనే పాత్రలో నన్ను ప్రిపేర్ చేశారు డైరెక్టర్. ఇప్పటివరకూ సినిమా చూసిన ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. అందరూ ఆదరిస్తారనే నమ్మకం వుంది.

రివర్స్ ట్రైలర్ ఆలోచన ఎవరిది  ?  
ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచే బిజినెస్ ఓపెన్ అయ్యింది. ఐతే రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ వుంటే బావుంటుందని అభిప్రాయం వచ్చింది. ఇది థ్రిల్లర్. ఇలాంటి సినిమాలకి ట్రైలర్ లో ఎక్కువ కంటెంట్ ని చూపించలేం. ఐడియా బావుంటేనే మరో ట్రైలర్ రిలీజ్ చేద్దాం లేకపోతే వద్దు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు నాలుగు ఐడియాలతో వచ్చారు. అందులో రివర్స్ ట్రైలర్ ఆలోచన చాలా నచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేసిన కరెక్ట్ గా సింక్ అయిన షాట్స్ ని రివర్స్ ట్రైలర్ గా రిలీజ్ చేశాం. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రిమియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?
 అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేము ఏదైతే కంటెంట్, కాన్సెప్ట్ ని నమ్మి చేశామో , ప్రిమియర్స్ చూసిన ఆడియన్స్ కూడా వాటిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ , ఫైట్స్ , మ్యూజిక్ , ట్విస్ట్ లు అన్నీ  బావున్నాయని చెబుతున్నారు. మొదటిసారి ఈ సినిమా చూసిన వారికి కాన్సెప్ట్ కంటెంట్ ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్ళి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. రెండోసారి సినిమా చూసిన వారికి అద్భుతమైన స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

మీరు ఎంచుకున్న కథలు గురించి అన్నయ్యకి చెబుతారా ?
ఖచ్చితంగా. నేను విన్న కథల్లో నాకు నచ్చిన కథలని అన్నయ్య కి చెబుతాను. హిడింబ కథని కూడా విన్నారు. ఆయనకి చాలా నచ్చింది.  

అనిల్ సుంకర గారి సపోర్ట్ ఎంతవరకు వుంది ?
వ్యక్తిగా అనిల్ సుంకర గారి గురించి ఒక మాట చెప్పాలి. సినిమా పట్ల ఆయనకి వున్న అంకితభావం అద్భుతం. రాజీపడకుండా రిలాక్స్ అవ్వకుండా పని చేస్తుంటారు. అనిల్ సుంకర గారి లాంటి ప్రొడ్యుసర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండటం  అదృష్టంగా భావిస్తున్నాను. చాలా నిజాయితీ గల నిర్మాత. అనిల్ గారు లాంటి నిర్మాత మాతో జాయిన్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కొత్తగా చేయబోయే సినిమాలు ?
మెడికల్ మాఫియా థ్రిల్లర్ నేపధ్యంలో సినిమా వుంటుంది. అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago