హరీష్ శంకర్ చేతులమీదుగా హలో మీరా టీజర్

సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని హలో మీరా అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ఈ మేరకు ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ హలో మీరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన హరీష్ శంకర్.. ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలిసిపోతోందని చెప్పారు.

ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ హలో మీరా టీజర్ లో సినిమా సోల్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఇంతలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, లవర్, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. దాంతో మీరా పరిస్థితి ఏమైంది అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది.హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా..

ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట.సింగల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం అనే ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టుతో ఈ హలో మీరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని “హలో మీరా” కథపై ఎన్నో కసరత్తులు చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అవుట్ పుట్ తీసుకొస్తున్నారట. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం పక్కా అంటున్నారు మేకర్స్. అతి త్వరలో ఈ డిఫరెంట్ మూవీని
గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

3 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago