డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన పైలం పిల్లగా ట్రైలర్.

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ‘పైలం పిలగా’ సినిమా టీజర్ ని హరీష్ శంకర్ గారు లాంచ్ చేసారు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటి అంటే డబ్బు .  ఒక చిన్న పల్లెను పాలించాలన్న ,  మొత్తం ప్రపంచాన్ని శాసించాలన్నా జేబు నిండుగా ఉండాలి .  ఈ సత్యం గ్రహించి తెలంగాణ పల్లెలో పుట్టి పెరిగిన ఓ పిలగాడు దుబాయ్ వెళ్లి లక్షలు కోట్లు సంపాదించాలని, అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కోసం చేసే ప్రయత్నం లో  తాను ఒక్కడే  కాదు ఊరంతా బాగుపడే వ్యాపార అవకాశం దొరికి,  ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే క్రమంలో బ్యూరోక్రసీ సిస్టమ్ లో ఇరుక్కొని ప్రేమించిన అమ్మాయిని ,  కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే పరిస్థితులను ఎలా  ఎదుర్కొన్నాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. 

    సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. చిన్న సినిమా అయినప్పటికీ ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు సూపర్ హిట్ అయి సినెమా పై అంచనాలు పెంచుతున్నాయి .   టీజర్ రిలీజ్ సందర్బంగా హరీష్ శంకర్ గారు మాట్లాడుతూ టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారు అనిపిస్తుంది. 

టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, టైటిల్ క్యాచిగా ఉంది, మంచి డైలాగ్స్ ఉన్నాయి .   మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగుణ్ణి ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది అంటూ సినిమా టీం ని అభినందించారు .  

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి   పైగా యాడ్ ఫిలిమ్స్ కి  దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న  మొదటి చిత్రం ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది.
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్
స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతొంది.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago