శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం అక్టోబర్ 25న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు సోమవారం నాడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత బాగా రివ్యూలు వస్తాయని, ఆడియెన్స్ ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు. ఇంకా చూడని వాళ్లంతా చూసి మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఆడియెన్స్ సైతం మా సినిమాను ప్రశంసిస్తున్నారు. మాలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం. మా సినిమాను ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి’ అని అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…