అద్బుతమైన నటనను కనబర్చే డెబ్యూ యాక్టర్స్ కనిపించకపోవడంతో కొత్త వారితో చేయాలన్నా ఆలోచనను మానుకున్నాను.. ‘సయారా’పై మోహిత్ సూరి

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండేని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ మూవీలో అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా సయారా ట్రైలర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘అహాన్ పాండే, అనీత్ పద్దా వంటి అద్భుతమైన నటులు నాకు దొరకకపోతే నేను సయారా సినిమా చేసేవాడిని కాదు. ఒకానొక టైంలో డెబ్యూ ఆర్టిస్టుల్లో అద్భుతమైన టాలెంట్ కనిపించలేదు.. అలా కొత్త వారు ఎవ్వరూ కనిపించకపోతే ఈ మూవీని చేయకూడదని అనుకున్నాను. కానీ నాకు అహాన్, అనీత్ వంటి గొప్ప ఆర్టిస్టులు దొరికారు. కొత్త నటీనటులతో ప్రేమకథను నిర్మించేటప్పుడు వారి కెమిస్ట్రీకి, నటనకి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి.

సహజమైన భావోద్వేగాల్ని పండించాల్సి ఉంటుంది. కొత్త నటీనటులు రణబీర్ కపూర్, అలియా భట్ స్థాయి నటనను కలిగి ఉంటారని ఎవరూ ఆశించరు. కానీ వారు తెరపై తమదైన శైలిలో నటించే నటులుగా ఉండాలి. నటనా సామర్థ్యం ఉన్న డెబ్యూ నటీనటులను నేను చూడలేదు. అందుకే ఈ స్క్రిప్ట్‌ను తొలి నటీనటులతో రూపొందించాలనే ఆలోచనను నేను వదులుకున్నాను.

కమర్షియల్ కోణంలో ఆలోచించి నేను స్క్రిప్ట్‌ను కాస్త మార్చాను. అలా సయారా రచనా ప్రక్రియకు చాలా సమయం పట్టింది. ఆపై YRF వద్దకు వెళ్లాను. అహాన్, అనీత్ ఆడిషన్‌లను చూశాను. వారితో కొంత కాలం ట్రావెల్ చేశాను. ఈ ఇద్దరూ అద్భుతం చేశారు. కొత్తవారితో ప్రేమకథను రూపొందించడం చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. నేను ఈ కథను రూపొందించాలనుకున్న విధంగానే చేశాను. నాకు ఈ ఇద్దరూ దొరకడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సైయారాను నిర్మిస్తున్న YRF CEO అక్షయ్ విధాని మాట్లాడుతూ.. ‘YRFలో ఎన్నో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ వచ్చాయి. కాబట్టి మరోసారి అలాంటి ఓ కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించాలని మోహిత్ సూరితో ఈ మూవీని నిర్మించాం. నేటి యువతకు వారి భావాలు, భావోద్వేగాలు, నిబద్ధతలు ఎంత లోతుగా, నిజాయితీగా ఉన్నాయో చూపించడం ద్వారా వారికి కనెక్ట్ అయ్యే నిజమైన ప్రేమకథను చెప్పాలని మేము ప్రయత్నించాం.సయారా అద్భుతంగా వచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. ఇది సహజంగానే YRF బ్యానర్ నుంచి వచ్చే ఓ అందమైన ప్రేమకథ అని చెప్పుకోవచ్చు. డెబ్యూ ఆర్టిస్టులతో చేసిన ఈ ప్రేమ కథను ఆడియెన్స్ ఓ రిఫ్రెషింగ్‌గా భావిస్తారని మేం ఆశిస్తున్నామ’ని అన్నారు.

సయారా నుంచి ఫహీమ్-అర్స్లాన్ ఆలపించిన టైటిల్ ట్రాక్, జుబిన్ నౌటియాల్ పాడిన బర్బాద్, విశాల్ మిశ్రా గాత్రంలో వచ్చిన తుమ్ హో తో, సచేత్-పరంపర పాడిన హమ్‌సఫర్, అర్జిత్ సింగ్ , మిథూన్ కలిసి పాడిన ధున్ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సయారా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

13 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago