జివి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్ “డియర్” షూటింగ్ పూర్తి

జివి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్  ప్రధాన పాత్రలలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న “డియర్” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ‘డియర్’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి అంచనాలు పెరిగాయి. దానికి కారణం ‘మ్యూజికల్ కింగ్’ జి.వి. ప్రకాష్ కుమార్, అద్భుతమైన నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలసి నటించడం.

నట్ మెగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సేతుమ్ ఆయిరమ్ పొన్’ఫేం ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించడంలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వ ప్రావీణ్యం, మంచి ఎగ్జిక్యూషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా వున్నారు.  ప్రీప్రొడక్షన్ దశలోనే అనుకున్న ప్రకారం కేవలం 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ‘డియర్’ చిత్రాన్ని చెన్నై, ఇడుక్కి, కూనూర్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్  చేస్తారు.

ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్‌లతో పాటు, కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, ‘బ్లాక్ షీప్’ నందిని, పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. రుకేశ్ ఎడిటింగ్‌ను, ప్రగదీశ్వరన్ ఆర్ట్‌వర్క్‌ను, అనూష మీనాక్షి కాస్ట్యూమ్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ‘రాప్’ ఐకాన్ అరివు ఈ చిత్రంలో ఒక పాటను స్వయంగా రాసి, పాడారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago