గ్రాండ్ గా జరిగిన అపర్ణ సినిమాస్ లాంచింగ్ ఈవెంట్
-అపర్ణ సంస్థ సినిమాస్ లోకి రావడం సినిమా ఇండస్ట్రీకి శుభపరిణామం. అపర్ణ సినిమాస్ దేశంలో ది బెస్ట్ మాల్ అవుతుంది: నిర్మాత ఎన్వీ ప్రసాద్
సక్సెస్ ఫుల్ కన్స్ట్రక్షన్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ సినిమాస్ లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా మోడరన్ టెక్నాలజీ, అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఘనంగా జరిగిన ఈవెంట్ లో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు.
అపర్ణ సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో అపర్ణ కన్స్ట్రక్షన్ & ఆపరేషన్స్ హెడ్ రామ కృష్ణ మాట్లాడుతూ.. 2010లో నల్లగండ్లలో ఏమీ వుండేది కాదు. అ రోజుల్లోనే సిటీలో అతి పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ అపర్ణ సరోవర్ ని కట్టి ఇవ్వడం జరిగింది. ఇది నిర్మించినప్పుడే మా కస్టమర్స్ కి మల్టీ ఫ్లెక్స్, మాల్ రాబోతుందని చెప్పాం. ఆ ప్రామిస్ పూర్తి చేయడానికి అపర్ణ సినిమాస్ కట్టడం జరిగింది. అపర్ణ ఏది చేసినా ది బెస్ట్ గా వుంటుంది. మాల్, సినిమాస్ కూడా ది బెస్ట్. ఎన్వీ ప్రసాద్ గారి సలహాలతో అపర్ణ సినిమాస్ లోకి రావడం జరిగింది. ఎక్కడా రాజీపడకుండా అత్యద్భుతంగా మల్టిప్లెక్స్ ని కట్టాం. యాంబియన్స్. ప్రొజక్షన్, సౌండ్, సిట్టింగ్, కంట్రోల్ టెంపరేచర్, లాబీ, రెస్ట్ రూమ్స్ ఇలా అనీ ఆధునాతన టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. అలాగే సినిమాతో పాటు మంచి ఫుడ్ ని కూడా ఆస్వాదించే ఏర్పాటు చేయడం జరిగింది. అపర్ణ సినిమాస్ ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది’ అన్నారు
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ..అపర్ణ సంస్థల ఓనర్, నేను స్నేహితులం. తను ఏదైనా ది బెస్ట్ కోరుకుంటారు. ఎక్కడా రాజీపడడు. ఈ మాల్ లో కొత్త స్పెషాలిటీ అండర్ గ్రౌండ్ లో రెండు కార్లు ఒకేసారి వెళ్ళొచ్చు, రావచ్చు. ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ సిట్టింగ్ ప్రొజెక్షన్ వుంది. సినిమాతో పాటు ఫుడ్ కూడా రిజినబుల్ ధరల్లోనే వుంటాయి. అపర్ణ ప్రపంచవ్యాప్తంగా ఓ మంచి బ్రాండ్. సినిమాస్ లో ది బెస్ట్ గా వుండేలా అద్భతంగా నిర్మించారు. మే31 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఇండియాలోనే ఒక ప్రైడ్ మాల్ అవుతుంది. ప్రేక్షకులు గొప్ప అనుభూతితో సినిమా చూసి వెళ్తారు. అపర్ణ సంస్థ సినిమాస్ లోకి రావడం సినిమాలకి శుభపరిణామం. కొత్త బ్రాండ్ లాంచ్ అయ్యింది. భవిష్యత్ లో మరిన్ని థియేటర్స్ లో వస్తాయి. ఇండియాలోనే అపర్ణ సినిమాస్ బెస్ట్ మాల్ అవుతుందని కోరుకుంటున్నాను” అన్నారు.
హెడ్ ఆపరేషన్స్ & అపర్ణ సినిమాస్ సునీల్ ద్వివేది మాట్లాడుతూ.. అపర్ణ సినిమాకి అందరికీ స్వాగతం. అపర్ణ సంస్థ ఎంటర్ టైన్మెంట్ వరల్డ్ కి అడుగుపెట్టడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు ది బెస్ట్ సినిమాస్ అనుభూతిని అందించేలా అపర్ణ సినిమాస్ వుంటుంది’ అన్నారు.
అపర్ణ సినిమాస్ మేనేజర్ మధుకర్ మాట్లాడుతూ.. అపర్ణ సినిమాస్ రావడానికి కారణం అపర్ణ కన్స్ట్రక్షన్స్. నల్లగండ్లలో దాదాపు 13వేలకు పైగా ప్లాట్స్ అపర్ణ కమ్యునిటీలో వున్నాయి. వారందరికీ అద్భుతమైన మాల్, మల్టీ ఫ్లెక్స్ అనుభూతిని అందించే అపర్ణ సినిమాస్ నిర్మించడం జరిగింది. అపర్ణ కన్స్ట్రక్షన్స్ లానే అపర్ణ సినిమాస్ కూడా అద్భుతమైన పేరు సంపాదించుకుటుంది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ వున్నాయి. మొత్తం కెపాసిటీ 1208. ఇందులో 135 గోల్డ్ క్లాస్ సీట్స్ కి ఎంట్రీ సెపరేట్ గా వుంటుంది. అందులో వేరే మల్టీ ఫ్లెక్స్ లో లేని ఫీచర్స్ వుంటాయి. పవర్ బ్యాంక్ తో పాటు ఫుడ్ స్పెషిలిటీ కూడా వుంటుంది. మాకు సొంత కిచెన్ వుంది. అందరికీ అందుబాటులో ధరల్లో ఫ్రెష్ ఫుడ్ లభ్యమౌతుంది” అన్నారు.
ప్రోగ్రామింగ్ మేనేజర్ శివ కుమార్ మాట్లాడుతూ.. అపర్ణ అంటే ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అపర్ణ సినిమాస్ ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. అపర్ణ బెస్ట్ సినిమాస్ గా నిలబడుతుంది.
ఎగ్జిక్యూటివ్ చెఫ్ సుమిత్..మాట్లాడుతూ.. గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో పాటు ది బెస్ట్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేలా అపర్ణ సినిమాస్ వుంటుంది. మిగతా మల్టీ ఫ్లెక్స్ లో దొరకని డిఫరెంట్ ఫుడ్ మెనూ ఇక్కడ లభ్యమౌతుంది. సొంత కిచెన్ లో తాజా ఫుడ్ తయారౌతుంది’ అన్నారు.
క్యూబ్ డిజిటల్ సినిమాస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. అపర్ణ సినిమాస్ లో బార్కో సిరిస్ 4 ప్రొజెక్టర్ ని ఏర్పాటు చేశాం. ఇది వరల్డ్ లో అడ్వాన్స్ లేజర్ ప్రొజెక్టర్. క్యాలిటీకి రాజీపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని గొప్ప ప్రోజెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు స్క్రీన్స్ లో డాల్బీ అట్మాస్, రెండు స్క్రీన్స్ లో 7. 1 ఛానల్ సౌండ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. థియేటర్ లో ఏ కార్నర్ నుంచి సినిమా చూసిన సరే ప్రేక్షకులని లీనం చేసేలా సౌండ్, ప్రోజెక్షన్ వుంటుంది’ అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…