ఘనంగా ‘100 కోట్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్

యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 కోట్లు’ అనే చిత్రాన్ని నిర్మించారు. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా ఎస్ ఎస్ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి రచయిత, దర్శకుడు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి సహ నిర్మాతగా.. వెంకట్ సుధాకర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక వంద కోట్లు అనే టైటిల్‌తోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది.

దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘వంద కోట్లు అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డీ మానిటైజేషన్‌లో వంద కోట్ల చుట్టూ తిరిగే కథ అని, ఫస్ట్ టైం సినిమాను నిర్మిస్తున్నానని సాయి కార్తీక్ గారు చెప్పారు. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతం. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వీర శంకర్ మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి. కన్నడ నటుడు చేతన్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలి. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. ‘సాయి కార్తీక్ గారంటే నాకు చాలా ఇష్టం. అర్దరాత్రి ఫోన్ చేసి అడిగినా ట్యూన్స్ ఇస్తుంటారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. చేతన్‌కు తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ చిత్రయూనిట్‌ను తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలి. పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ‘2016లో జరిగిన యథార్థ కథ. కరోనా తరువాత ఈ పాయింట్‌ను అనుకుని ప్రాజెక్ట్ చేశాం. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.

హీరో చేతన్ మాట్లాడుతూ.. ‘తెలుగు పరిశ్రమలోకి హీరోగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కార్తీక్ గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, మా సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.

ఈ మూవీకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎస్ బీ ఉద్దవ్ ఎడిటర్‌గా, వింగ్ చున్ అంజి ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

నటీనటులు : రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : ఎస్ ఎస్ స్టూడియోస్
నిర్మాత : దివిజా కార్తీక్, సాయి కార్తీక్
సహ నిర్మాత : కళ్యాణ్ చక్రవర్తి
దర్శకుడు : విరాట్ చక్రవర్తి
సంగీత దర్శకుడు : సాయి కార్తీక్
ఎడిటర్ : స్ బీ ఉద్దవ్
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago