యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 కోట్లు’ అనే చిత్రాన్ని నిర్మించారు. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా ఎస్ ఎస్ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి రచయిత, దర్శకుడు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి సహ నిర్మాతగా.. వెంకట్ సుధాకర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక వంద కోట్లు అనే టైటిల్‌తోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది.
దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘వంద కోట్లు అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డీ మానిటైజేషన్‌లో వంద కోట్ల చుట్టూ తిరిగే కథ అని, ఫస్ట్ టైం సినిమాను నిర్మిస్తున్నానని సాయి కార్తీక్ గారు చెప్పారు. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతం. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
వీర శంకర్ మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి. కన్నడ నటుడు చేతన్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలి. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. ‘సాయి కార్తీక్ గారంటే నాకు చాలా ఇష్టం. అర్దరాత్రి ఫోన్ చేసి అడిగినా ట్యూన్స్ ఇస్తుంటారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. చేతన్‌కు తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ చిత్రయూనిట్‌ను తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలి. పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ‘2016లో జరిగిన యథార్థ కథ. కరోనా తరువాత ఈ పాయింట్‌ను అనుకుని ప్రాజెక్ట్ చేశాం. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.
హీరో చేతన్ మాట్లాడుతూ.. ‘తెలుగు పరిశ్రమలోకి హీరోగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కార్తీక్ గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, మా సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.
ఈ మూవీకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎస్ బీ ఉద్దవ్ ఎడిటర్‌గా, వింగ్ చున్ అంజి ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.
నటీనటులు : రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఎస్ ఎస్ స్టూడియోస్
నిర్మాత : దివిజా కార్తీక్, సాయి కార్తీక్
సహ నిర్మాత : కళ్యాణ్ చక్రవర్తి
దర్శకుడు : విరాట్ చక్రవర్తి
సంగీత దర్శకుడు : సాయి కార్తీక్
ఎడిటర్ : స్ బీ ఉద్దవ్
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)