వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం ‘కృష్ణమ్మ’ సిినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా..
నటుడు కృష్ణ బూరుగుల మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ ట్రైలర్ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రేపు అదే వైబ్స్ సినిమాలో కనిపిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు అందించిన సపోర్ట్‌ను మరచిపోలేను. ఎంటైర్ టీమ్‌కు ఈ మూవీతో పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ అతీర మాట్లాడుతూ ‘‘మే 10న మా ‘కృష్ణమ్మ’ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ప్రేక్షకులందరూ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత కృష్ణ కొమ్మలపాటిగారికి, దర్శకుడు వి.వి.గోపాలకృష్ణగారికి థాంక్స్. అలాగే నాతో పాటు నటించిన సత్యదేవ్ గారికి, అర్చనకు, ఇతర టీమ్ సభ్యులకు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ‘‘మీ దగ్గరున్న థియేటర్స్‌లో ‘కృష్ణమ్మ’ సినిమా మే 10న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా సినిమాను చూడాలని కోరుకుంటున్నాం. విజువల్ ఎమోషనల్ మూవీగా నచ్చుతుంది. పద్మ అనే పాత్రకు నేను సూట్ అవుతాననిపించి అవకాశం ఇచ్చిన మా నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు చాలా మంచి కో ఆర్టిస్ట్. అందరూ సినిమాను చూసి ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ‘‘కొరటాలగారు నాలుగు గంటల పాటు కథ విని ఓకే చేసిన వ్యక్తి. ఆయనకు విజయవాడ గురించి బాగా తెలుసు. ఆయనే ఆశ్చర్యపొయేలా కొత్త విజయవాడను ఈ సినిమాలో చూపిస్తున్నందుకు ఆయనకు కథ నచ్చింది. ఇందులో బెజవాడ పాలిటిక్స్, రౌడీలు కనిపించరు. బెజవాడ కుర్రాళ్లలోని రుబాబుతనం, అమాయకత్వం బేస్ చేసుకుని కథను రాశాం. కృష్ణా నది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టిందనేది ఎవరికీ తెలియదు. అలాగే ఈ సినిమాలో హీరో, అతని ఫ్రెండ్స్ ఎలా పుట్టారనేది తెలియదు. అనాథలు. అలాగే కృష్ణమ్మ ప్రహించేటప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. హీరో అతని ఫ్రెండ్స్ జీవితాలు అన్ని మలుపులు తిరుగుతాయి. అందుకనే ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టాం. మా సినిమా మే 10న రిలీజ్ అవుతుంది. చూసి సపోర్ట్ చేయండి’’ అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ మే 10న రిలీజ్ కానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. సినిమా విషయానికి వస్తే దర్శకుడు గోపాల్ గారు బెస్ట్ స్క్రిప్ట్‌ను ఇచ్చారు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో వస్తారని నమ్మకం ఉంది. సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. దర్శకుడికి తొలి సినిమా అంటున్నారు. కానీ మేకింగ్ మాత్రం పది సినిమాలు చేసిన డైరెక్టర్ లా చేశారు. ఇలాంటి కథను నాకు ఇచ్చినందుకు తనకు నేను రుణపడి ఉంటాను. తనకు ఈ సినిమాకు తొలి మెట్టు మాత్రమే. తను భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేస్తారు. మా నిర్మాత కృష్ణగారు ప్యాషన్‌తో కృష్ణమ్మ సినిమా చేశారు. ఆయనకు థాంక్స్. కొరటాల శివగారు లేకపోతే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదు. ఆయనకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ గొప్ప సంగీతాన్ని ఇచ్చారు. సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…