టాలీవుడ్

‘కృష్ణమ్మ’ సినిమా చూసి ప్రేక్షకులు ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు – హీరో సత్యదేవ్

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం ‘కృష్ణమ్మ’ సిినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా..

నటుడు కృష్ణ బూరుగుల మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ ట్రైలర్ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రేపు అదే వైబ్స్ సినిమాలో కనిపిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు అందించిన సపోర్ట్‌ను మరచిపోలేను. ఎంటైర్ టీమ్‌కు ఈ మూవీతో పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరోయిన్ అతీర మాట్లాడుతూ ‘‘మే 10న మా ‘కృష్ణమ్మ’ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ప్రేక్షకులందరూ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత కృష్ణ కొమ్మలపాటిగారికి, దర్శకుడు వి.వి.గోపాలకృష్ణగారికి థాంక్స్. అలాగే నాతో పాటు నటించిన సత్యదేవ్ గారికి, అర్చనకు, ఇతర టీమ్ సభ్యులకు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.

హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ‘‘మీ దగ్గరున్న థియేటర్స్‌లో ‘కృష్ణమ్మ’ సినిమా మే 10న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా సినిమాను చూడాలని కోరుకుంటున్నాం. విజువల్ ఎమోషనల్ మూవీగా నచ్చుతుంది. పద్మ అనే పాత్రకు నేను సూట్ అవుతాననిపించి అవకాశం ఇచ్చిన మా నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు చాలా మంచి కో ఆర్టిస్ట్. అందరూ సినిమాను చూసి ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

చిత్ర దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ‘‘కొరటాలగారు నాలుగు గంటల పాటు కథ విని ఓకే చేసిన వ్యక్తి. ఆయనకు విజయవాడ గురించి బాగా తెలుసు. ఆయనే ఆశ్చర్యపొయేలా కొత్త విజయవాడను ఈ సినిమాలో చూపిస్తున్నందుకు ఆయనకు కథ నచ్చింది. ఇందులో బెజవాడ పాలిటిక్స్, రౌడీలు కనిపించరు. బెజవాడ కుర్రాళ్లలోని రుబాబుతనం, అమాయకత్వం బేస్ చేసుకుని కథను రాశాం. కృష్ణా నది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టిందనేది ఎవరికీ తెలియదు. అలాగే ఈ సినిమాలో హీరో, అతని ఫ్రెండ్స్ ఎలా పుట్టారనేది తెలియదు. అనాథలు. అలాగే కృష్ణమ్మ ప్రహించేటప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. హీరో అతని ఫ్రెండ్స్ జీవితాలు అన్ని మలుపులు తిరుగుతాయి. అందుకనే ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టాం. మా సినిమా మే 10న రిలీజ్ అవుతుంది. చూసి సపోర్ట్ చేయండి’’ అన్నారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ మే 10న రిలీజ్ కానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. సినిమా విషయానికి వస్తే దర్శకుడు గోపాల్ గారు బెస్ట్ స్క్రిప్ట్‌ను ఇచ్చారు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో వస్తారని నమ్మకం ఉంది. సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. దర్శకుడికి తొలి సినిమా అంటున్నారు. కానీ మేకింగ్ మాత్రం పది సినిమాలు చేసిన డైరెక్టర్ లా చేశారు. ఇలాంటి కథను నాకు ఇచ్చినందుకు తనకు నేను రుణపడి ఉంటాను. తనకు ఈ సినిమాకు తొలి మెట్టు మాత్రమే. తను భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేస్తారు. మా నిర్మాత కృష్ణగారు ప్యాషన్‌తో కృష్ణమ్మ సినిమా చేశారు. ఆయనకు థాంక్స్. కొరటాల శివగారు లేకపోతే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదు. ఆయనకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ గొప్ప సంగీతాన్ని ఇచ్చారు. సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Tfja Team

Recent Posts

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి ‘మెకానిక్ రాకీ’ నుంచి సాంగ్ ఓ పిల్లా రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో రాబోతున్నారు. రవితేజ…

1 hour ago

Song Oo Pilla From Vishwak Sen Mechanic Rocky Unveiled

Mass Ka Das Vishwak Sen is coming up with the highly anticipated mass action and…

1 hour ago

ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ #యూఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్…

2 hours ago

బాలయ్య బెస్ట్ విషష్ తో పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో

'పైలం పిలగా' ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్…

2 hours ago

Pailam Pilaga set to Relese on September 20th

The highly anticipated movie Pailam Pilaga is all set to release this week on *September…

2 hours ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు…

2 hours ago