గుడ్ బ్యాడ్ అగ్లీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

Must Read

స్టార్ హీరో అజిత్ కుమార్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు అజిత్ ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ లో వైబ్రెంట్ అవుట్ ఫిట్స్, చేతినిండా టాటూస్, షేడ్స్ ధరించి ఎదురుగా వున్న వెపన్స్ తో అమెజింగ్ గా కనిపించారు అజిత్. మూడు లుక్స్ లో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో మెస్మరైజ్ చేశారు. సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచిన ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా పని చేస్తుండడగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్.

ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

తారాగణం: అజిత్
సాంకేతిక సిబ్బంది
రచన & దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డీవోపీ: అభినందన్ రామానుజం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో: సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మార్కెటింగ్ (తమిళం) : డి’వన్
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్: ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
సిఈవో: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News