‘‘గోదారి అటు వైపో
నాదారి ఇటు వైపో
అమ్మాయి నీదారెటువైపో…’’
అంటూ అమ్మాయిని చూసి మన హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుంది. అమ్మాయి కోసం వెతికే అబ్బాయి అన్వేషణ తెలుసుకోవాలంటే శశివదనే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు.
శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ – గౌరీ నాయుడు, బ్యానర్స్ – ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు – అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం – సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ – శ్రీసాయి కుమార్ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ – అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ – జేడీ, సి.ఇ.ఒ – ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ – సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).
AR The announcement of Sanjay Leela Bhansali's next epic saga titled LOVE AND WAR, starring…
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ సత్యం సుందరం. 96 ఫేమ్ సి…
The trailer for Love, Sitara, starring Sobhita Dhulipala and Rajeev Siddhartha, was released, giving viewers…
Karthi and Arvind Swami play the lead roles in the wholesome entertainer Sathyam Sundaram directed…
నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది. తారాగణం: నాని సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్…
Natural Star Nani is set to play his most intense role yet in his 32nd…