‘శశివదనే’ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో..’ సాంగ్ రిలీజ్.. ఏప్రిల్ 19న సినిమా భారీ విడుదల

Must Read

‘‘గోదారి అటు వైపో
నాదారి ఇటు వైపో
అమ్మాయి నీదారెటువైపో…’’

అంటూ అమ్మాయిని చూసి మన హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుంది. అమ్మాయి కోసం వెతికే అబ్బాయి అన్వేషణ తెలుసుకోవాలంటే శశివదనే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు.

శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

Godari Atu Vaipo Lyrical Song | Sasivadane | Rakshit Atluri | Komalee | Anudeep Dev |Telugu New Song

నటీనటులు:

రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ – గౌరీ నాయుడు, బ్యానర్స్ – ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు – అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం – సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ – శ్రీసాయి కుమార్ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ – అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ – జేడీ, సి.ఇ.ఒ – ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ – సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News