నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘NBK109’ నుండి ప్రత్యేక గ్లింప్స్ విడుదల

Must Read

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ‘న్యాచురల్ బోర్న్ కింగ్’ గా, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గా తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే సినిమాలను అందించడంలో ఆయన దిట్ట. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు.

తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. “జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.

#NBK109 - Nandamuri Balakrishna Birthday Glimpse | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న ‘NBK109’ నుండి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది.

రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా, పవర్ ఫుల్ గా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. ‘NBK109’లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. చూడటానికి స్టైలిష్ గా ఉంటూ, అసలుసిసలైన వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం. అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో.. అలా ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నారు.

సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్లింప్స్ లో వారి పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కార్తీక్ విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. ఎస్.థమన్ నేపథ్య సంగీతం గ్లింప్స్ ని మరోస్థాయిలో నిలబెట్టింది.

నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News