ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోన్న ‘గాండీవధారి అర్జున’..సమాజంపై మంచి ఆలోచన రావాలనే ఉద్దేశంతో చేసిన సినిమా – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గాండీవధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ….
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘నాకు హాలీడే అన్నా, పండుగ అన్నా కూడా మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజే. ఆయనకు అభిమానులందరి తరుపునా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ఫస్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, నా చివరి దర్శకుడు అనిల్ రావిపూడి గారు,నా ప్రజెంట్ డైరెక్టర్ ఇదే స్టేజ్ మీదున్నారు. నన్ను నటుడిగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. వెరైటీ సినిమాలు తీసిన ప్రతీ సారి కమర్షియల్ సినిమాలు తీసుకోవచ్చు కదా? అని సలహాలు ఇస్తుండేవారు. కానీ కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. సినిమా హిట్టైనా ఫ్లాపైనా నా ప్రయత్నం ఆగదు. ఆడియెన్స్ సపోర్ట్ ఇంకా ఇలాంటి కొత్త కథలు చేస్తూనే ఉంటాను. సోషల్ మెసెజ్ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాలోని కోర్ పాయింట్ వల్లే ఒప్పుకున్నాను. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనల రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. నిన్న రాత్రే ఈ సినిమాను చూశాను. మంచి సినిమా తీశామనే ఫీలింగ్ వచ్చింది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత తొలిప్రేమతో నాకు మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. విరూపాక్షతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాను తీశారు. టీం అంతా కూడా కష్టపడి పని చేసింది. నా మాటలు కాదు.. నా సినిమా, నా పని మాట్లాడాలి. ఆగస్ట్ 25న థియేటర్లోకి సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు చాలా జానర్లు టచ్ చేశాయి. చందమామకథలు, గరుడవేగ చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎమోషన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను తీశాను. గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఎమోషన్‌ను జోడించి ఎంటర్టైనింగ్ యాక్షన్ జోనర్‌లో తీశాను. ఈ కథ రాయడం ఈజీగానే ఉంటుంది. కానీ ఇలాంటి కథను చేసే హీరో కావాలి. ఇది హీరో బేస్డ్ కథ కాదు. కథలో ఓ భాగంగా హీరో ఉంటాడు. కథ బాగుంది.. కథలో తన పాత్ర బాగుంటే.. సినిమాలు చేసే హీరో వరుణ్.
అందుకే ఈ కథను ఆయనకు చెప్పాను. ఆడియెన్స్‌కు ఎక్కడా లోటు లేకుండా బడ్జెట్ పరిమితులతో తీయాలి. ఈ ఒత్తిడిలో 72 రోజుల షూటింగ్‌ను టీం అంతా కలిసి కష్టపడి 54 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. హీరో డెడికేషన్ వల్లే అది సాధ్యమైంది. దెబ్బలు తగిలినా కూడా షూటింగ్ చేశాడు. వరుణ్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఈ సినిమాను మనసుతో చేశాను. నా మనసుకు నచ్చిన సినిమా. ఆగస్ట్ 25న ఈ చిత్రం రాబోతోంది. మా అందరినీ ఆడియెన్స్ ఆశీర్వదించాల’ని కోరుకున్నాను.
చి్త్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్‌తో మేం ఇది వరకు చేసిన తొలి ప్రేమ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చరణ్ బాబుకు థాంక్స్’ అని అన్నారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు గారిని, నేను హీరోగా పరిచయం చేసిన వరుణ్ తేజ్‌ను ఇలా ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త సబ్జెక్టులను ఎంచుకుంటూ ఉంటాడు. ఈ సినిమా కోసం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ మేకింగ్, మిక్కీ సౌండ్ అద్భుతంగా ఉంది. విరూపాక్షతో ఈ బ్యానర్ ఆల్రెడీ హిట్ కొట్టింది. బాపీకి మరో హిట్ రాబోతోంది. ఫిదా, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మా బ్యానర్లో వరుణ్ చేశాడు. ఈ సినిమాను ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.
అనిర్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పెద్ద హిట్ అయి టీం అందరికీ మంచి పేరు రావాలి. ప్రవీణ్ సత్తారు అన్ని రకాల జానర్లను టచ్ చేస్తుంటారు. సాక్షి వైద్యకు ఆల్ ది బెస్ట్. బాపీగారు, భోగవల్లి ప్రసాద్ గారు నా మొదటి సినిమా నుంచి పరిచయం. వారిద్దరికీ ఆల్రెడీ ఓ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి. నా బ్రదర్ లాంటి వాడు వరుణ్. ప్రతీ ఫిల్మ్ కొత్తగా ఉండాలని చూస్తుంటాడు. కొత్త కథలు ఎంచుకుంటూ ఉంటాడు. వరుణ్ ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నాలో ఐరా పాత్రను చూసి ఛాన్స్ ఇచ్చిన ప్రవీణ్ గారికి థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడటం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. వరుణ్ తేజ్ గారు మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ఉంటారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న సమస్యల మీద వచ్చిన ఈ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నారు. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…