‘గాంధీ టాక్స్’ .. జ‌న‌వ‌రి 30న గ్రాండ్ రిలీజ్‌

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సారథ్యంలో ప్ర‌ముఖ సంస్థ జీ స్టూడియోస్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘గాంధీ టాక్స్’ .. జ‌న‌వ‌రి 30న గ్రాండ్ రిలీజ్‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘గాంధీ టాక్స్’కు సంబంధించి విడుద‌ల తేదిని అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మూవీ జ‌న‌వ‌రి 30న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇండియ‌న్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌గా ‘గాంధీ టాక్స్’ రూపొందింది. క‌థ‌ను వివరించ‌టానికి మాట‌ల కంటే నిశ్శ‌బ్దం బ‌ల‌మైన అంశంగా నిలుస్తోంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్య‌మైన‌, సృజ‌నాత్మ‌క‌మైన అడుగు.

సినిమాను ఎంత గ్రాండియ‌ర్‌గా, ఎలాంటి సౌండ్‌తో రూపొందించారంటూ లెక్క‌లు వేసే నేటి రోజుల్లో గాంధీ టాక్స్ సినిమా త‌న సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శ‌బ్దాలు లేకుండా, భావోద్వేగాల‌తో చెప్ప‌బోతుంది. ఇందులో విజయ్ సేతుపతి, అర‌వింద్‌ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి అద్భుత‌మైన న‌టీన‌టులు న‌టించారు. వీరంద‌రూ త‌మ హావ‌భావాల‌తో, న‌ట‌న‌తో స్టోరీని అంద‌రికీ తెలియ‌జేస్తున్నారు.

విజ‌య్ సేతుప‌తి, అర‌వింద్ స్వామి వంటి స్టార్స్ ఈ సైలెంట్ ఫిల్మ్‌లో న‌టించ‌టానికి ఒప్పుకున్నారంటే సినిమా అనేది న‌ట‌న ఆధారిత సినిమా అని కూడా నిరూపించే ప్ర‌య‌త్నం చేయ‌ట‌మే. ఇది నిజంగా అతి పెద్ద ఛాలెంజ్‌. రొటీన్‌కు భిన్న‌మైన, ఛాలెంజింగ్ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వీరి తీరు వారి సినిమా అంటే వారికున్న ప్యాష‌న్‌ను తెలియ‌జేస్తోంది. అదితి రావు హైద‌రి, సిద్ధార్థ్ జాద‌వ్ వంటి స్టార్స్ పాత్ర‌ల భావాన్ని, స‌న్నివేశాల డెప్త్‌ను మాట‌లు లేకుండా హావ‌భావాల‌తో క‌థ‌ను నెరేట్ చేయ‌టంలో ప్ర‌త్యేక‌త‌ను చూపిస్తుంటారు.

సినిమాకు ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఆయ‌న గాంధీ టాక్స్ చిత్రానికి ఎమోష‌న‌ల్ వాయిస్‌గా నిలుస్తున్నారు. మాట‌లు లేకుండా రూపొందుతోన్న ఈ సినిమాకు రెహ‌మాన్ సంగీతం నెరేట‌ర్‌గా మారుతూ సినిమాలోని డెప్త్‌ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేస్తోంది. ఆయ‌న సంగీతం నిశ్శబ్దాన్ని శక్తివంతమైన, మానసికంగా గల అనుభవంగా మార్చి, సినిమాను ప్రపంచ స్థాయి, ఫెస్టివల్-తయారైన కళాకృతిగా నిలబెడుతోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కిషోర్ బెలేక‌ర్ మాట్లాడుతూ ‘‘నిశ్శబ్దం అనే నమ్మి గాంధీ టాక్స్ సినిమా ను రూపొందించాం. శతాబ్దంగా ఇండియ‌న్ సినీ మేక‌ర్స్ ప‌లు ర‌కాలైన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి క‌ళ‌లో పెర్ఫామెన్సెస్‌, ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకుని సినిమా చేయాల‌నుకున్నాం. న‌టీన‌టులు దీనికి ఈ కొత్త ప్ర‌య‌త్నంలో భాగం కావ‌టానికి ముందుకు రావ‌టంతో పాటు సున్నితమైన భావాల‌ను చ‌క్క‌గా ప‌లికించారు. అదే స‌మ‌యంలో ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారి సంగీతం.. సినిమా క‌థ‌ను చెప్పే వాయిస్‌గా మారింది. జీస్టూడియోస్‌, మీరా చోప్రా గారి స‌హకారంతో ధైర్యంగా, నిజాయ‌తీగా కొత్త ప్ర‌య‌త్నాన్ని చేశాం ’’ అన్నారు.

సినిమా సాంప్ర‌దాయాల‌ను స‌వాల్ చేసేలా, కొత్త‌ద‌నంతో, ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌థ‌ను చెప్పేలా ఉండే సినిమాల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చే నిబ‌ద్ధ‌త‌ను జీ స్టూడియోస్ మ‌రోసారి ఈ ప్ర‌య‌త్నంతో తెలియ‌జేసింది. ఇది భార‌తీయ సినిమాకు ఇండియ‌న్ సినిమాకు కొత్త భాష‌, దిశ‌ను తెలియ‌జేస్తుంది.

జనవరి 30, 2026న విడుదలకాబోతోన్న గాంధీ టాక్స్..  నిశ్శబ్దం ద్వారా ఎంతో చెప్పగలమ‌నే కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

15 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

15 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

15 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

15 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

15 hours ago