గాలోడు ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది

`సుడిగాలి` సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా విడుద‌లైన  `గాలోడు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..

హీరో సుధీర్ మాట్లాడుతూ- “గాలోడు ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మీడియా వారు కూడా వారి ఫ్యామిలీ మెంబ‌ర్‌లా చాలా స‌పోర్ట్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ టైంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాం. సాఫ్ట్‌వేర్ సుధీర్ త‌ర్వాత మ‌రోసారి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ పులిచ‌ర్ల‌గారికి థ్యాంక్యూ..గెహ్నా సిప్పి చాలా బాగా యాక్ట్ చేసింది. మీరు ట్రైల‌ర్‌లో చూసి ఎంజాయ్ చేసిన విజువ‌ల్స్ ఇచ్చిన‌ సి.రాంప్ర‌సాద్‌గారికి అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్. త్వ‌ర‌లోనే మ‌రో మీట్‌తో మీముందుకు వ‌స్తాం“అన్నారు

ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ పులిచ‌ర్ల మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడిగా నా ఫ‌స్ట్ సినిమా `సాఫ్ట్‌వేర్ సుధీర్‌`. `గాలోడు` నా సెకండ్ మూవీ. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు మా స్నేహితుల సహ‌కారంతో ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు పాట‌లు రిలీజ్ అయ్యాయి. అన్ని పాట‌ల‌కి మిలియ‌న్స్ కొద్ది వ్యూస్ వ‌చ్చాయి. అలాగే ఇటీవ‌ల  విడుద‌లైన ట్రైల‌ర్ 24 గంట‌ల్లోనే 2మిలియ‌న్ వ్యూస్ సాధించింది. దాంతో నాకు సినిమాపై కాన్ఫిడెంట్ మ‌రింత పెరిగింది. ఫ‌స్ట్ మూవీలో సుధీర్‌తో చాలా కంఫ‌ర్ట్ అనిపించి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌డం జ‌రిగింది. మంచి క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్ట్‌. త‌ప్ప‌కుండా హిట్ కొడుతున్నాం అనే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

హీరోయిన్ గెహ్నా సిప్పి మాట్లాడుతూ
 – “ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన సంస్కృతి ఫిలింస్ వారికి ముందుగా నా ధ‌న్య‌వాదాలు. అలాగే న‌న్ను న‌మ్మి నాకు ఈ క్యారెక్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ గారికి చాలా థ్యాంక్స్‌. కాలేజ్ యూత్‌కి, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా..త‌ప్ప‌కుండా థియేట‌ర్‌కి వెళ్లి చూడాల్సిన సినిమా ఇది“ అన్నారు.ప్ర‌పంచవ్యాప్తంగా `గాలోడు` సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago