ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీస్”ఆదిపర్వం” ప్రచార చిత్రానికిఅసాధారణ స్పందన!!!!

Must Read

కన్నడ – హిందీ – తమిళ
మలయాళ భాషల్లోనూ
ట్రెమండస్ రెస్పాన్స్
!!

ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ”ఆదిపర్వం”. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో… రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి… ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ… “ఆదిపర్వం” ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన… ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్” అన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.

సాంకేతికవర్గం:
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
ఆర్ట్ : కేవీ రమణ
మ్యూజిక్ : మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి,
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  
పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్
పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ
కో డైరెక్టర్: అక్షయ్ సిరిమళ్ళ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవి దశిక- రవి మొదలవలస –
శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్.ఎస్.కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి!!

Latest News

Sid Sriram’s ‘Ennennenno’ enchants with a heartfelt melody from “Veekshanam”

Ram Karthik, a young actor swiftly rising through the ranks of Telugu cinema, is making his mark with his...

More News