బి.ఎ.రాజు…సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో చక్రం తిప్పటం ఆయనకే సాధ్యమైంది. సూపర్‌స్టార్ కృష్ణ నుంచి అందరి అగ్ర హీరోలతో పని చేసిన అనుభవం ఆయనకే సొంతం. అందరినీ కలుపుకునిపోతూ వివాదాలకు దూరంగా ఉంటూ అజాత శత్రువగా తనదైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు.
సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి ఆర్ ఓ గా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు.
ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. అంతే కాకుండా క్రేజీ వరల్డ్ అనే మరో మ్యాగజైన్‌ను కూడా దశాబ్దకాలం పాటు సక్సెస్‌ఫుల్‌గా నడిపిన ఘనత ఆయనకే సొంతం. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బి.ఎ.రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు.
చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకున్న అజాత శత్రువు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు. ఈ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ అనే చిత్రంతో సూపర్‌హిట్ ఫ్రెండ్స్ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, ఆర్.జె.సినిమాస్ బ్యానర్‌పై లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, 6.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju’s Team ద్వారా అందిస్తున్నారు.
చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ… ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండేది. ఆయన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ దర్శకుడు ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా టక్కున చెప్పేవారు. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. మే 21న ఆయన 3వ వర్ధంతి. ఈ సందర్భంగా ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నాం.
Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…
మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ…
The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…