ఫిబ్రవరి 6.. తెలుగు సినిమా పుట్టిన రోజుగా చేయాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే అవార్డులతో పాటు, ఛాంబర్ తరఫు నుంచి వివిధ కేటగిరీల్లో అవార్డులు కూడా అందించాలనే నిర్ణయం జరిగింది. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం జరిగింది. ఈ జెండా రూపకల్పన బాధ్యతను సీనియర్ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. తొలి తెలుగు టాకీ సినిమాకు సంబంధించి వివరాలను ఎంతో రీసెర్చ్ చేసి భక్త ప్రహ్లాద గురించి తెలిపిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ కృషిని గుర్తు చేసుకుంటూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఇదే వేదికపై ఆయన రచించిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..
‘‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలుగు సినిమా దినోత్సవం మొదటిసారి చేయడం జరుగుతుంది. అంతకు ముందు కొన్ని సంస్థలు చేశాయి. ఈయేడాది నుంచి ఛాంబర్ తరఫు నుంచి చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా అనేది మా అందరికీ తల్లి లాంటిది. తెలుగు సినిమా ఛాంబర్ మదర్ బాడీ ఇక నుంచి ప్రతి సంవత్సరం చేయాలని డిసైడ్ చేశాం. మొదటి యేడాది కాబట్టి ఈ సారి నార్మల్ గా చేస్తున్నాం. నెక్ట్స్ ఇయర్ నుంచి గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. పాత తరం కళాకారులకు మరిన్ని సన్మానాలు చేస్తాం. సినిమా హిస్టరీ గురించి చెబితే.. సినిమా అనేది ఫస్ట్. బర్త్ ఆఫ్ సినిమా ముఖ్యం. చాలామంది ఎన్నో చరిత్రలు క్రియేట్ చేశారు. కానీ బర్త్ ఆఫ్ సినిమా అనేది ముఖ్యం. రాబోయే తరాలు కూడా ఇది గుర్తుంచుకోవాలి. జనాలు వస్తుంటారు పోతుంటారు. కానీ పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజును గురించి పాతికేళ్ల పాటు రీసెర్చ్ చేసి మొదటి తెలుగు టాకీ సినిమా డేట్ ను ఖచ్చితంగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను ’’ అన్నారు.
ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇవాళ సినిమా పుట్టిన రోజు. ఫస్ట్ టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. ఈచిత్రానికి హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి ముందు వేరే వేరే డేట్ అనుకునేవాళ్లం. రెంటాల జయదేవ్ గారు పరిశీలించి ఈ రోజు అని చెప్పడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భక్త ప్రహ్లాద కంటే ముందే కాళిదాసు అనే సినిమా 1931లో వచ్చింది. కాళిదాసు చిత్రంలో నాలుగు రీళ్లు తెలుగులోనే పాటలు, డైలాగులు ఉండి.. తెలుగు దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు.. తెలుగువాడైన గంగాధర్ హీరోగా నటించారు. తర్వాత మూడు రీళ్లు తమిళ్ లో ఉండటం కనిపిస్తుంది. ఈ కారణంగా కాళిదాసును తమిళ్ వాళ్లు వాళ్ల సినిమాగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా కాళిదాసు మన తెలుగు సినిమా. ఫస్ట్ హిందీ టాకీ మూవీ ఆలం ఆరా లో మన ఎల్వీ ప్రసాద్ గారు నటించారు. తెలుగు ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, తెలుగు, తమిళ్ ఫస్ట్ టాకీ కాళిదాసు.. ఈ మూడు చిత్రాల్లోనూ ఎల్వీ ప్రసాద్ గారు నటించారు. ఆయన ఆ రోజుల్లో మూకీ నుంచి టాకీ వరకూ యాక్ట్ చేసి.. చాలా కష్టపడి.. ఏడు రోజులు భోజనం లేకుండా బ్రతికి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చిన గొప్ప వ్యక్తి ఎల్వీ ప్రసాద్. ఆయనే ఎన్టీ రామారావుగారిని పరిచయం చేశారు. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. కానీ ఆ రోజుల్లో పాతాళ భైరవి ఎన్టీఆర్ నటించిన 6వ సినిమా. ఇది ఆ రోజుల్లోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యి ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకుంది. మొదటి తరాల్లో సన్నగా ఉన్నవారికే అవకాశాలు అనుకున్నారు. కానీ తర్వాత ఎన్టీఆర్ లాంటి భారీ మనుషులు, నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడూ కొన్ని విమర్శలు వచ్చినా.. తర్వాత ఆ ఇద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా మారడం అనే చరిత్ర చూశాం. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గొప్పదే. ఎలా చూసినా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పదనం వ్యాపించి ఉన్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకుందాం.. ’’ అన్నారు.
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ఇవాళ సంతోషకరమైన దినం. ఎప్పటి నుంచో చేసుకోవాల్సిన పండగ. ఇప్పటికైనా నిర్వహిస్తున్నందుకు సంతోషం. మనమంతా ఇండస్ట్రీ మీద బ్రతుకుతున్నవాళ్లం. ఒకప్పుడు నాగేశ్వరరావుగారు ఒక మాట అన్నారు. మేం వచ్చినప్పుడు చాలా పెద్ద పోటీ ఉండేది. మాకు సంస్కృతం మాట్లాడటం రాదు.. అప్పుడు వాళ్లు పాటలు కూడా పాడుకున్నారు. మాకు అవేవీ రాకున్నా.. ఎంతో హార్డ్ వర్క్ చేసి తర్వాత తరాలకు ఓ రోడ్ వేశాం. దానిపై మీరంతా హ్యాపీగా వెళుతున్నారు అన్నారు. అది నిజం. అలాంటి మహనీయులు చేసిన కృషే ఇది. మనం గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఎల్వీ ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పాలి. ఆయనతో పాటు ఎందరున్నా.. ఎల్వీ ప్రసాద్ గారు హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించి దర్శకుడుగానూ రాణించి సినిమా స్థాయిని పెంచారు. ఇవాళ రాజకీయ నాయకులకంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు మేం సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లం. అలాంటి సినిమాకు సంబంధించి ప్రతి సంవత్సంర పండగ చేసుకోవాలి. ఇప్పటికైనా చేస్తున్నందుకు అందరినీ అభినందిస్తున్నాను. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల వాళ్లు సమన్వయం చేసుకుని నిర్వహిస్తే ఇంకా బావుంటుంది. తెలుగు సినిమాకు సంబంధించి భక్త ప్రహ్లాద ఫైనల్. ఫిబ్రవరి 6 అనే డేట్ బావుంది. మనమంతా సినిమా ప్రపంచంలో ఉన్నాం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఎంతోమంది నిర్మాతల కృషి వల్లే మనమంతా ఈ స్థాయిలో ఉన్నాం. వచ్చే యేడాది ఈ పండగను గ్రాండ్ గా నిర్వహించుకుందాం.. ’’ అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ఒక మనిషి పుట్టిన రోజునే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సిల్వర్ జూబ్లీ అని గోల్డెన్ జూబ్లీ అని. అలాంటిది ఒక పెద్ద పరిశ్రమ.. సినిమా పుట్టిన రోజు. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా థియేటర్ లో విడుదలైన రోజు. భక్త ప్రహ్లాద రిలీజ్ అయిన రోజు అంటే ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టిన రోజుగా జరుపుకోవాలని నిర్ణయించడం గొప్ప విషయం. నాటి నుంచి నేటి వరకూ ఎందరో గొప్ప నటులు వచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీ రెండు కళ్లు అని చెప్పుకుంటాం. వీరిలాంటి ఎందరో మహా నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, గాయకులు.. మొత్తం 24 క్రాఫ్ట్స్ లో లెజెండ్స్ తో నిండిపోయింది. తెలుగు సినిమా ఇవాళ దశదిశలా వ్యాపించింది. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ సినిమా అయింది. అందుకు కారణం గొప్ప టెక్నీషియన్స్, దర్శకుల వల్లే అయింది. ఒకప్పుడు మనల్ని మదరాసీలు అనేవాళ్లు. అలాంటిది మన సినిమా వైపు యావత్ ప్రపంచ చూస్తోంది. ఈ ఖ్యాతిని పెంచడానికి ఎన్టీఆర్ కాలంనాటి నుంచి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఈ వందేళ్లో రంజింప చేయడమే కాదు.. ఆలోచింప చేయడంతో పాటు చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నమూ చేసింది. సమాజం మార్పు సినిమా వల్ల తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో గొప్ప అంశాలతో ముడిపడి ఉన్న తెలుగు సినిమా పుట్టిన రోజును అన్ని సంఘాలూ కలిసి గ్రాండ్ గా నిర్వహించుకోవాలని.. ఈ పుట్టిన రోజు సందర్భంగా మా మా అసోసియేషన్ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. ‘‘మన తెలుగు టాకీ సినిమా పుట్టిన రోజు శుభాకాంక్షలు. థియేటర్స్ లోని గేట్ కీపర్స్ నుంచి మేకర్స్ వరకూ అందరికీ ఇది పెద్ద పండగ. ఈ యేడాది ఛాంబర్ ఈ పండగను నిర్వహించాలని నిర్ణయించడం గొప్ప విషయం. మన దేశం నుంచి ఆగస్ట్ 15 ను ఎంత గొప్పగా జరుపుకుంటామో.. అలా తెలుగు సినిమా పుట్టిన రోజును కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వచ్చే యేడాది గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించిన సందర్భంగా మా దర్శకుల సంఘంకి ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజును వెలికి తీసే పరిశోధన చేసిన రెంటాల జయదేవ్ గారికి కృతజ్ఞతలు. కాళిదాసును తెలుగు సినిమా అని చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డాం అనే చెప్పాలి. మొదటిసారిగా తెలుగు డైలాగులు స్క్రీన్ పైన వినిపించిన చిత్రం కాళిదాస్ కాబట్టి ఆ చిత్రాన్ని కూడా మనం ఓన్ చేసుకోవాలి. తెలుగు సినిమాకు పితామహుడైన హెచ్ఎమ్ రెడ్డి ఆ రోజున చేసిన ప్రయత్నమే ఈ పండగకు ఆద్యం. సినిమా చాలా శక్తివంతమైనది. ఒకప్పుడు రైతుబిడ్డ అనే చిత్రాన్ని చల్లపల్లి రాజా వారు నిర్మించారు. ఆ సినిమా చూసిన జనం రాజా వారిపైనే తిరుగుబాటు చేశారు. సినిమాకు అంత శక్తి ఉంది. క్రైమ్ సినిమాకు ముందు తర్వాత ఉంది. సినిమాల వల్ల క్రైమ్ పెరగడం లేదు. మనుషుల్లో ఉన్న నేర ప్రవృతినే సినిమాల ద్వారా చూపిస్తున్నాం. సినిమాలు సమాజాన్ని చెడగొట్టవు. సినిమా వాళ్ల గురించి తక్కువగా మాట్లాడే వారిపై ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి కఠినంగా వ్యవహారించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరికీ తెలుగు సినిమా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది సాధారణంగా నిర్వహించాం. ఇవాళ బీజం వేశాం. రాబోయే రోజుల్లో మహా వృక్షంగా మారి అందరికీ తెలుగు సినిమా గొప్పదనం తెలిసేలా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా రెంటాల జయదేవ్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ముత్యాల రాందాస్, నిర్మాత ఆచంట గోపీనాథ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, పద్మజ, సీనియర్ ప్రొడ్యూసర్ వేమూడు సత్యనారాయణ, నిర్మాత సాంబశివరావు, ఫైటర్స్ యూనియన్ సెక్రటరీ అలెక్స్, శ్రీనివాస్, బి. బాపిరాజు, కే అమ్మిరాజు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…