“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు చిత్ర టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా..ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు “దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మాట్లాడుతూ.. కదిరిలో ఉన్న సూర్యనారాయణ గారు అన్నవరం లో ఉన్న హీరోతో వైజాగ్, రాజమండ్రి లలో విజయవంతంగా షూటింగ్ చేసుకొని “దోస్తాన్” అని మంచి టైటిల్ పెట్టారు.ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ బాగున్నాయి.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ..మంచి ప్లానింగ్ తో ఫ్రెండ్స్ టైటిల్ తో తీసిన “దోస్తాన్” సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడు తూ.. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ తో ఇంతకుముందు ప్రేమదేశం, ప్రేమసందేశం వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ తమకున్న వాటిని షేర్ చేసుకుంటూ ఎలా లీడ్ చేశారో అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ “దోస్తాన్” చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు మాట్లాడుతూ..మా “దోస్తాన్” చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ధన్యవాదాలు.నా భార్య కోరిక మేరకు నేను సినిమా తియ్యాలని ఎన్నో కథలు విన్నాను. అవేవి నాకు నచ్చలేదు.సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను.తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ఈ సినిమా పూర్తి చేయడానికి 96 రోజులు పట్టింది. ఇందులోని ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో సిద్ స్వరూప్ మాట్లాడుతూ.. మా దోస్తాన్ చిత్ర టీజర్ ను విడుదల చేసిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు..చిన్నతనం లోని ఫ్రెండ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టిన దోస్తాన్ టైటిల్ తో వస్తున్న ఇది నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

మరో నటుడు కార్తికేయ మాట్లాడుతూ.. సిద్ శ్రీరామ్ డే, & నైట్ కష్టపడి స్క్రిప్ట్ ను తయారు చేశాడు. కొత్త వారిని పెట్టిన సినిమాలకు డబ్బురాదనీ తెలిసికూడా మమ్మల్ని నమ్మి తీసిన దర్శక,నిర్మాతకు ధన్యవాదములు

చిత్ర హీరోయిన్ ప్రియ వల్లబి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

10 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago