బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.
తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ‘రాజు యాదవ్’ నుంచి ఫీల్ మై స్మైల్ సాంగ్ ని లాంచ్ చేసిన యూనిట్ కి అభినందనలు తెలిపారు.
స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఫీల్ గుడ్ మెలోడీ నెంబర్ గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యశస్వి కొండేపూడి తన లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.
సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.
నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
ఏపీ, తెలంగాణ రిలీజ్: బన్నీ వాస్
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్
గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి
కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్
పీఆర్వో: వంశీ – శేఖర్
సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…