అభిమానం ముందు అనారోగ్యం కూడా ఓడిపోవాలి… శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

Must Read

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి.

కానీ పదో తరగతిలో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఫిట్స్ రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉన్న శషి… ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతూ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది.

అయితే ఈ కష్టాల్లోనూ ఆమె మనసులో మాత్రం ఒక అభిమానం చెక్కుచెదరలేదు.

అది హీరో రామ్ పోతినేనిపై ఉన్న అంతులేని అభిమానం. ❤️

శషి సాధారణంగా ఉన్నప్పటి నుంచే రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలు విన్నా… ఆయన ఫోటో చూసినా… ఆమె ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ఇప్పుడు కూడా రామ్ గారి పాటలు వినిపించినా, ఆయన ఫోటోలు చూపించినా శషిలో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది.

కూతురి పరిస్థితిని చూసి ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతం. అయినా కూతురి మనసులోని చిన్న కోరికను నెరవేర్చేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు.

ప్రతిరోజూ రామ్ గారి రీల్స్ చూపిస్తూ…

“రామ్ నీకోసమే వీడియో కాల్ చేశారు…”

అంటూ కూతురికి భోజనం పెట్టే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు.

శషికి ఉన్న ఒకే ఒక్క కోరిక—తన అభిమాన హీరో రామ్ పోతినేనితో ఒక్కసారి మాట్లాడాలి.

ఆ కోరికను రామ్ గారు తెలుసుకున్నారు.

ఈ రోజు శషితో వీడియో కాల్‌లో మాట్లాడి, ఆమెను ఆప్యాయంగా పలకరించారు. త్వరలోనే నిన్ను కలుస్తానని మాట ఇచ్చారు.

అంతేకాదు…

“మందులు, భోజనం టైమ్‌కి తీసుకో. త్వరగా రికవరీ అవ్వాలి. హైదరాబాద్ నుంచి నీకు మందులు, ఫుడ్ పంపిస్తాను” అంటూ శషికి ధైర్యం చెప్పారు.

ఆ మాటలు శషికి కేవలం ఓ సెలబ్రిటీ చెప్పిన మాటలు కాదు…

తన అభిమాన హీరో తనతో మాట్లాడాడనే ఆనందం… త్వరలో కలుస్తానని ఇచ్చిన మాట…

ఆ చిన్నారి జీవితంలో ఒక కొత్త ఆశను నింపిన క్షణాలు.

సినిమా హీరోలు తెరపై చేసే పాత్రలు మనకు ఎన్నో భావోద్వేగాలను ఇస్తాయి. కానీ నిజ జీవితంలో ఒక అభిమాని కష్టాన్ని అర్థం చేసుకుని, ఆమెతో మాట్లాడి, ఆమెకు ధైర్యం చెప్పడం మాత్రం మానవత్వానికి నిదర్శనం.

శషి త్వరగా కోలుకుని…

మళ్లీ మునుపటిలాగే నవ్వుతూ, ఆడుతూ, చదువుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.

ఒక అభిమాని కోరికను అర్థం చేసుకున్న రామ్…
ఒక తల్లి కన్నీళ్లకు ధైర్యం ఇచ్చిన రామ్…
ఒక చిన్నారి ముఖంలో మళ్లీ ఆనందాన్ని నింపిన రామ్… ❤️

శషి త్వరగా కోలుకోవాలి…
రామ్ గారిని ఆరోగ్యంగా కలుసుకుని తన అభిమానాన్ని స్వయంగా చెప్పాలి. 🙏❤️

Latest News

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

More News