టాలీవుడ్

గుణశేఖర్‌ ‘యుఫోరియా’ గ్లింప్స్‌ను విడుదల చేసిన దిల్ రాజు కే ఎల్ దామోదర ప్రసాద్

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గుణ శేఖర్ గారి మొదటి చిత్రం లాఠీ. అది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘గుణ శేఖర్ వెర్సటైల్ దర్శకుడు. యుఫోరియా గ్లింప్స్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘యుఫోరియా గ్లింప్స్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు గారు, దాము గారికి థాంక్స్. అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్‌గా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. ఏడాదిన్నర క్రితం ప్రాజెక్ట్ అనుకున్నాం. ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం. వీళ్లందరినీ ఆడిషన్స్ చేసి.. వర్క్ షాపులు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వారినే తీసుకున్నాం. వాళ్లంతా కూడా కథకు కనెక్ట్ అయ్యారు. వారి వారి పాత్రల్లో జీవించేశారు. సినిమాటిక్‌‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్నయూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘వరల్డ్ ఆఫ్ యుఫోరియా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన దిల్ రాజు గారెకి, దాము గారెకి థాంక్స్. చక్కగా తెలుగు మాట్లాడే వాళ్లు.. థియేటర్ ఆర్టిస్టుల్ని ఈ సినిమాకు తీసుకున్నాం. ఆడియెన్స్ ఆశీర్వాదాన్ని సినిమాకు అందించాలి’ అని అన్నారు.

విఘ్నేష్ మాట్లాడుతూ.. ‘యూఎస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యాక్టింగ్ చేస్తున్నాను. సమ్మర్‌లో ఇక్కడి రావడం, గుణ శేఖర్ లాంటి లెజెండ్ కంట్లో పడటంతో ఈ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. గుణ శేఖర్ గారి నుంచి ఇలాంటి కంటెంట్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.

శ్రీనిక రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన గుణశేఖర్ గారికి థాంక్స్. మొదటి సినిమా ఎవ్వరికైనా చాలా ప్రత్యేకం. మా సినిమాకు ఆడియెన్స్ ఆశీర్వాదం కావాలి’ అని అన్నారు.

పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన దిల్ రాజు గారు, దాము గారు, మీడియాకు థాంక్స్. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు గుణ శేఖర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

లిఖిత మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చారు. అమృత అనే ఓ మంచి కారెక్టర్ నా మొదటి సినిమాకే రావడం ఆనందంగా ఉంది. టీజర్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇంత గొప్ప చిత్రంలో నేను పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

15 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago