‘యుఫోరియా’ చిత్రానికి సంగీత దర్శ‌కుడిగా కాల భైర‌వ‌

Must Read

కాల భైర‌వ‌.. భార‌త‌దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపారు. ఆయ‌న‌ ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని  టీమ్ తెలియ‌జేసింది.

Latest News

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్,...

More News