నమస్కారం,
ఈశా గ్రామోత్సవం రాష్ట్ర (డివిజినల్) స్థాయి పోటీలు సెప్టెంబర్ 10న ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారంలో జరగనున్నాయి.
2004 నుండి ఈశా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈశా గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలు ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు. సాధారణ గ్రామీణులకు ఆటలో భాగమై, ఆడడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూపించడమే దీని ప్రత్యేకత.
ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని అయిదు రాష్ట్రాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 3 స్థాయిల్లో నిర్వహిస్తున్నారు – జిల్లా, డివిజినల్ ఇంకా ఫైనల్స్. ఫైనల్స్ కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో నిర్వహిస్తారు.
తెలంగాణలో 9 జిల్లాల నుండి జిల్లా స్థాయి పోటీలకు 227 వాలీబాల్ & 119 త్రోబాల్ టీం లతో అద్భుతమైన స్పందన లభించింది.సుమారు 2700 ఆటగాళ్ళు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణలోని 9 జిల్లాల విన్నర్ లు ఇంకా రన్నర్ లు పాల్గొనే ఈ ఉత్సాహభరిత పోటీలకు మీ అందరినీ ఈ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
తేదీ: సెప్టెంబర్ 10,2023, ఆదివారం
సమయం:పోటీలు ఉ.9 నుండి,
ముగింపు కార్యక్రమం : 4 PM నుండి 5:30PM వరకు
స్థలం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారం
శ్రీమతి కొర్ర లక్ష్మి,ఐఏఎస్,డైరెక్టర్,SATSగారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
Cloud templates
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
96189 54075
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…