టాలీవుడ్

23వ సంవత్సరంలోకి ‘’సంతోషం’’ – త్వరలోనే 2024 అవార్డ్స్ ఫంక్షన్

ఒక సినీ వారపత్రిక 22 సంవత్సరాలు పూర్తిచేసుకొని, 23వ వసంతంలోకి అడుగుపెట్టడం అది కూడా సెకను సెకనుకు అప్డేట్స్ వస్తున్న ఈ డిజిటల్ యుగంలో అంటే అది చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఆగస్ట్ 2వ తేదీతో ‘సంతోషం’కు 22 ఏళ్లు నిండి 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ రోజున్న పరిస్థితులలో పత్రికా నిర్వహణ కత్తిమీద సాము లాంటి వ్యవహారం, అత్యంత కఠిన పరీక్ష, ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ ‘సంతోషం’ దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వెళుతోంది.

సినీ వార పత్రికా రంగంలో ఇది ఒక అరుదైన అపురూప సందర్భం! ఈ సందర్బాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ‘సంతోషం సురేష్ గా పేరు పొందిన సురేష్ కొండేటి. ‘సంతోషం’ సాధించిన విజయం వెసుకున్న మనిషి ఆయనే. ఎడిటర్, పబ్లిషర్ గా సంతోషం’ను తన మానస పుత్రికగా భావించి అపూర్వంగా, అపురూపంగా చూసుకుంటూ, దాని ఎదుగుదలను అమితంగా ఆస్వాదిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త సొబగులను అద్దుతూ, ప్రతి సంచికనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ, చిత్రసీమలో దానికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టారు సురేష్, అందుకే వారం వారం అందరూ ”సంతోషం’’గా చదువుతూనే ఉన్నారు. చేతిలో పత్రిక ఉంది గదా అని దానిని అడ్డుపెట్టుకుని ఎవరిపైనా రాళ్లు వేయటానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పత్రిక ఉంది అని దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు. అది ఆయన నైజం కాదు తన పత్రిక ద్వారా అసలు ఏ ఒక్కరినీ నొప్పించడానికి ఒప్పుకోరు! అది ఆయన గుణం. తన సొంత పనులు, తన సొంత కార్యకలాపాలు.. అన్నీ తనవరకే పరిమితం. ఏనాడు, ఏ పరిస్థితిలోనూ పత్రికాముఖంగా ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి చూడలేదు, అవి జర్నలిస్టుగా ఆయనకు ఉన్న ఎథిక్స్.

సురేష్ కొండేటి నిజాయితీకి నిలువెత్తు రూపం. అదే నిజాయితీని ఎదుటివాళ్ల నుంచీ ఆశిస్తారు. అలా అని ఆయన సత్తెకాలపు సత్తెయ్య కాదు. నేటి జనరేషన్ కి తగ్గట్లు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉండడంతో ఇండస్ట్రీలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లనే భేదం లేకుండా అందరూ సురేష్ కొండేటిని అభినందిస్తుంటారు. మరింత ఎదగాలని ఆశీర్వదిస్తుంటారు. ఇండస్ట్రీలో సురేష్ కొండేటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. మరెన్నో నష్టాలను చవి చూశారు. మరొకరైతే ఆ కష్టాలు, నష్టాలు, సమస్యలకు కుంగిపోయి కుదేలై పోతారు. తట్టాబుట్టా సర్దుకొని మరేదైనా లాభసాటి పనో, వ్యాపారాన్నో చేపడతారు కానీ సురేష్ కొండేటి ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు! సురేష్ కు సహజంగా అబ్బిన ఒక గుణం…. మాట చాతుర్యం. ఆ చాతుర్యంతో చొచ్చుకుపోవటం! అందుకే ఈ సాధ్యంకాని అనుభవాన్ని, సీనియారిటీని, పరిచయాలు, ప్రాభవాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించారు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కుంటూ పత్రికను నిర్విరామంగా తీసుకురావచ్చు.

ఏడాది వేడుకలను’ అద్భుతంగా జరుపుకోవచ్చు. కానీ, వార్షికోత్సవ అవార్డుల వేడుకలను నిర్వహించడం ఒక అసామాన్యమైన విషయం. ‘ఈ అవార్డుల వేడుకను కూడా సంతోషం వార్షికోత్సవ వేడుకలతో పాటు జరుపుతూ వస్తున్నారాయన. వార్షికోత్సవ వేడుకల కంటే అవార్డుల వేడుకలను ఘనంగా జరపటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సురేష్ కి సాధ్యమైంది. అవార్డుల వేడుక అంటే హైదరాబాద్ ఇండస్ట్రీ లోని వాళ్ళను పిలిచి అవార్డులను ఇచ్చేయడం కాదు. దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రసీమలకు సంబంధించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాది భాషల్లో సీనియర్ కళాకారుల్ని సాదరంగా పిలిచి వారిని సత్కరించడమనే అసాధ్యమైన కార్యక్రమాన్ని ఏటేటా సురేష్ కొండేటి బ్రహ్మాందంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సురేష్ కొండేటి అలుపెరుగని శ్రామికుడు. అదే ఆయన విజయ రహస్యం.

కాక పోతే తెలుగునాట ఏ ఒక్క ఇతర పత్రికా నిర్వహించలేని (నిర్వహించలేక కొందరైతే మధ్యలోనే ఆపేశారన్న విషయం విదితమే ) అవార్డుల వేడుకను సురేష్ తానొక్కడిగా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ రావడం సాధ్యపడేవా? ఒక ప్రాంతీయ పత్రిక తన వార్షికోత్సవంతో పాటు, అవార్డు వేడుకను ఇన్నేళ్లుగా నిర్వహించడం సురేష్ ప్రతిభా సామర్ధ్యాలకు నిఖార్సైన తార్కాణం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు నిజాయితీ, నమ్మకం కూడా ఎడమలుగా నిలుపుకున్న సురేష్ కొండేటి అన్నిటా అగ్రస్థానంలో నిల్చుని విజయఢంకా మ్రోగిస్తున్నారు. ఇక రెండు సంవత్సరాల నుంచి పాపులర్ అయిన ఓటీటీ సినిమాలకు వెబ్ సిరీస్ లకు కూడా అవార్డులు ఇస్తూ తనను తాను అప్డేట్ చేసుకోవడమే కాదు ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఒక దిక్సూచిలా నిలుస్తూ సురేష్ కొండేటి దూసుకుపోతున్నారు. ఈ ఏడాది కూడా ఓటిటి కి సంబంధించి 3వ సంతోషం ఓటిటి అవార్డ్స్ ను కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాదు కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే సంతోషం డిజిటల్ ఫిలిం న్యూస్ అంటూ యూట్యూబ్ వేదికగా ప్రతిరోజు ఎపిసోడ్ల వారీగా రిలీజ్ చేస్తూ సినిమా విశేషాలను అందరికీ చేరువయ్యేలా చేస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో మొదలైన ఈ ఫిలిం న్యూస్ ఇప్పటికీ నిరాటంకంగా ఒక్క రోజు కూడా ఆగకుండా వెలువడుతూ 1590 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాలకు నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా డైలీ “సంతోషం సురేష్” ఛానల్లో సంతోషం ఫిలిం న్యూస్ వస్తూనే ఉంది. ఒకరకంగా టాలీవుడ్ సినీ జర్నలిజం చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పాలి* ఇక ఈ ఏడాది జరగబోతున్న సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అలాగే సంతోషం ఓటీటీ అవార్డుల ఈవెంట్ కి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Tfja Team

Recent Posts

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…

4 hours ago

డ్రింకర్ సాయి సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…

4 hours ago

Aaron Taylor-Johnson Gives Fans An Insight Into How He Got Into Shape For Kraven The Hunter

Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…

5 hours ago

“క్రావెన్ గా మారడం గురించి చెప్పిన టేలర్ జాన్సన్”

వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సం మ్యాన్ అయిన టేలర్ జాన్సన్ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, తను క్రావెన్ ది…

7 hours ago

డిసెంబర్ నెల 23 న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య’,  ప్రణయ…

8 hours ago

డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ నిర్వహించిన తెలుగోడి బీట్ట్ సాంగ్ లాంచ్ – గ్రాండ్ సక్సెస్!

డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ…

8 hours ago