మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “ఆరంభం” చిత్ర రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
అనౌన్స్ మెంట్ నుంచి “ఆరంభం” సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో పాటు హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేసిన అనగా అనగా లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను “ఆరంభం” ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ చిత్ర విజయం సినిమా యూనిట్ నమ్మకంతో ఉన్నారు.
నటీనటులు – మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ – సందీప్ అంగిడి
సౌండ్ – మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
సీఈవో – ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ – అభిషేక్ వీటీ
దర్శకత్వం – అజయ్ నాగ్ వీ