“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్, ఈ నెల14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ‘మరి మరి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే -‘ మరి మరి నిన్ను వెతికేలా, మరవదు ఓ క్షణమైనా, మనసంతా నీ తలపులే, ప్రతి చోటా నీ గురుతులే, వేచా గడిచిన నిన్నల్లో, వెతికా నడిచిన దారుల్లో, వెలుగే విడిచిన నీడల్లో, వదిలి వెళ్లిన జాడల్లో…’అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట. ప్రాణంగా ప్రేమించిన భార్యతో వచ్చిన ఎడబాటు ఎలాంటి బాధను మిగిల్చిందో హీరో వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్)

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago