టాలీవుడ్

సత్యదేవ్ యాక్షన్ మూవీ‘కృష్ణమ్మ’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ ‘దుర్గమ్మ’ రిలీజ్

సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 3న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.. అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘దుర్మమ్మ..’ అనే సెలబ్రేషన్ సాంగ్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలభైరవ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా సాకేత్ కొమండూరి పాడారు. నవరాత్రుల సమయంలో దుర్గమ్మ ముందు హీరో సంతోషంగా ఆడిపాడే సందర్భంలో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.

‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.   లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు:

సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ –  కొరటాల శివ
బ్యానర్ – అరుణాచల క్రియేషన్స్
నిర్మాత – కృష్ణ కొమ్మలపాటి
రచన, దర్శకత్వం – వి.వి.గోపాలకృష్ణ
సంగీతం – కాల భైరవ
సినిమాటోగ్రఫీ – సన్నీ కూరపాటి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ – రామ్ కుమార్
పాటలు – అనంత శ్రీరాం
ఫైట్స్ – పృథ్వీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవి సూర్నెడ్డి
పి.ఆర్.ఒ – వంశీ కాకా

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago