‘పరాక్రమం’ సినిమా నుంచి ‘డ్రీమ్’ సాంగ్ రిలీజ్

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “పరాక్రమం” సినిమా నుంచి ‘డ్రీమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘డ్రీమ్’ సాంగ్ కు బండి సరోజ్ కుమార్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా పాడారు. ఈ సాంగ్ ఎలా ఉందో చూస్తే..’వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం…తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం…’ అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఎలిమెంట్స్ తో “పరాక్రమం” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా రూపొందించారు బండి సరోజ్ కుమార్. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోందీ సినిమా.

నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్
కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ – వెంకట్ ఆర్ ప్రసాద్
సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్
కలరిస్ట్ – రఘునాథ్ వర్మ
ఆర్ట్ : ఫణి మూసి
ఫైట్స్ – రాము పెరుమాళ్ల
డ్యాన్స్ – రవి శ్రీ
పబ్లిసిటీ డిజైనర్ : లక్కీ డిజైన్స్
పి ఆర్ ఓ : పాల్ పవన్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago