నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి రచన , దర్శకత్వం వహిస్తుండగా, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌ను నరేష్ పున:ప్రారంభించారు.
ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. నరేష్ , పవిత్ర అందమైన కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్ గా వుంది. గ్లింప్స్ పాజిటివ్ వైబ్స్ ని జనరేట్ చేసింది.
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
ఈ వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు.
తారాగణం: డాక్టర్ నరేష్ వికె, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు
సాంకేతిక విభాగం:
రచన , దర్శకత్వం: ఎంఎస్ రాజు
నిర్మాత: డాక్టర్ నరేష్ వికె
బ్యానర్: విజయ కృష్ణ మూవీస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అరుల్ దేవ్
డీవోపీ: ఏంఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిక్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
సాహిత్యం: అనంత శ్రీరామ్
పీఆర్వో : వంశీ-శేఖర్
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…
Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati…
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో చిత్రీకరించిన 'ఏలా అల తీపికోరే పూలతోట' పాట విడుదల అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన…
The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual…
Written and Directed by K. Praful Chandra, 'Keep The Fire Alive' is being presented by…
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే "కీప్ ది ఫైర్ అలైవ్". ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్…