చలనచిత్ర నటుడు, నిర్మాత డా. హరనాథ్ పోలిచెర్లకు అరుదైన గౌరవం లభించింది. లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్థంతి, ఎఎన్ఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని డా. హరనాథ్ పోలిచెర్లకు అందించి సత్కరించారు.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ సినీ నటులు బ్రహ్మనందం, దర్శకనిర్మాతలు అశ్వనీదత్, వైవీఎస్ చౌదరి, సాహితీవెత్త అందెశ్రీ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డా. హరనాథ్ పోలిచెర్ల ను జీవన సాఫల్య పురస్కారం తో సత్కరించి అభినందించారు. ఆయన వైద్య రంగంలో, సినీ రంగంలో చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తనకు గౌరవ సత్కారం అందించిన లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహకులకు, అతిథులకు డా. హరనాథ్ పోలిచెర్ల ధన్యవాదాలు తెలిపారు.
సినీ రంగంలో తనదైన ప్రతిభ చూపిస్తున్న డా. హరనాథ్ పోలిచెర్ల ప్రముఖ నిర్మాత రామానాయుడు కీలక పాత్రలో నటించిన ‘హోఫ్’ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘చంద్రహాస్’ను నిర్మించారు. తన సినీ ప్రస్థానంలో ‘అలెక్స్’, ‘చాప్టర్ 6’, ‘బీఎఫ్ఎఫ్’, ‘కెప్టెన్ రానా ప్రతాప్’, ‘డ్రిల్’ వంటి చిత్రాలలో హీరోగా నటించి, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డా.హరనాథ్ పోలిచెర్ల ‘నా తెలుగోడు’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడెమీ కాస్టింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తోంది.
డా. హరనాథ్ పోలిచెర్ల లోకనాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనకు సినీ రంగం నుంచి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…