‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కి చార్ట్-బస్టర్ ఆల్బమ్‌, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు. ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’ ని  జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్ గా మాస్ ప్రేక్షకులకు ఇన్స్టంట్ ఎడిక్షన్ కానుంది. రామ్ డ్యాన్స్ మూవ్స్ మెయిన్  హైలైట్‌గా ఉంటాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ని అందించారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సంజయ్ దత్ మెయిన్ విలన్, కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ గా నటించారు.

డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago