టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఫణి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఫణి సినిమా టైటిల్,ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో జరిగింది. ఫణి సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా,ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొని ఫణి సినిమా టీమ్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ – నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఫణి సినిమాతో వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు మా ఫణి మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన నిర్మాత అనిల్ సుంకర గారికి, తోటకూర ప్రసాద్ గారికి, ఇతర అతిథులు అందరికీ థ్యాంక్స్. మా ఫణి మూవీ ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మిగతా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ తో మా ఓ.ఎం.జీ సంస్థలో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ – ఫణి మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. డాక్టర్ వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సినిమాలను మనం ఎంతగానో ఇష్టపడతాం. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఫణి మూవీ షూటింగ్ కు ప్రతి రోజు ఎగ్జైట్ మెంట్ తో వెళ్లాను. మిమ్మల్ని థ్రిల్ చేసేలా ఫణి మూవీ ఉంటుంది. అన్నారు.
నటి నేహా కృష్ణ మాట్లాడుతూ – ఫణి మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీరు మా మూవీకి ఇలాగే సపోర్ట్ అందిస్తూ ఉండాలి. ఫణి మూవీతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మాట్లాడుతూ – ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఈరోజు 90శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే. ఫణి మూవీ టైటిల్ బాగుంది. మీనాక్షి గారి మ్యూజిక్ ఆకట్టుకుంది. డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.
హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ – ఫణి మూవీ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పాను. కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదేనని చెప్పగలను. దర్శకుడు డాక్టర్ వీఎన్ ఆదిత్య గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆయనకు ఫిలింమేకింగ్ మీద ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే ఆయన చాలా నాలెజ్డ్ పర్సన్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఓ.ఎం.జీ సంస్థ తమ తొలి చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం. అన్నారు.
డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – ఫణి మూవీ టైటిల్ లాంఛ్ చేసిన డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, బ్యానర్ లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారికి , ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మీనాక్షి మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు బాగా తెలుసు. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అన్నప్పుడు ముందు ఒక షార్ట్ ఫిలిం చేయి, ప్రొడ్యూసర్ ఇబ్బందులు తెలుస్తాయి అన్నాను. కథ చెప్పండి అంది. అలా ఒక కథ చెప్పి సాయంత్రమే షూటింగ్ అంటే వెంటనే ఏర్పాట్లు చేసింది. అప్పుడు అనుకున్నా తను ప్రొడ్యూసర్ గా రాణిస్తుందని. ఫణి సినిమా కథ చెప్పగానే కేథరీన్ నాకు బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని అంది. ఆమె ధైర్యానికి అభినందనలు. ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలంటే, అదీ కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే అంత ఈజీగా ఒప్పుకోరు. కేథరీన్ లేకుంటే మా ఫణి మూవీ లేదు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ తో త్వరలోనే సినిమాను కంప్లీట్ చేస్తాం. ప్రీ రిలీజ్, ప్రీమియర్స్ లో మళ్లీ మనందరం కలుసుకుందాం. అన్నారు.
నిర్మాత డాక్టర్ మీనాక్షి అనిపిండి త్వరలోనే వాకో సిటీ లో తను నిర్మించబోయే “ఫిష్ ఐ ” స్టూడియో బ్రోచర్ ని మాస్టర్ ధన్విన్ పాకా,మాస్టర్ శ్రీకర్ కల్లూరి ఆవిష్కరించారు.
పూర్తిగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫణి చిత్రానికి
నటీనటులు – కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్
సమర్పణ – ఏయు & ఐ స్టూడియో పద్మ నాభరెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత – డాక్టర్ మీనాక్షి అనిపిండి
రచన – పద్మావతి మల్లాది
ఎడిటర్ జునైద్
కెమెరామెన్ బుజ్జి.కె.
సాయికిరణ్ అయినంపూడి
సీజీ-వి.ఎఫ్.ఎక్స్ హెన్రీ,
బెవర్లీ ఫిలిమ్స్ , లాస్ ఏంజెలెస్,
స్టంట్స్ జాన్ కాన్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం – డాక్టర్ వీఎన్ ఆదిత్య
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…