నచ్చినవాడు చిత్రం నుంచి ‘ఈ కాలమే’ పాటను విడుదల చేసిన దర్శకుడు మారుతి

Must Read

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన పాటలు ఆదిత్య మ్యూజిక్ లో మంచి ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ గాయకుడు జావేద్ అలీ పాడిన పాట, యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించిన పాట ‘ఈ కాలమే’ పాటను సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి విడుదల చేశారు.

అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ “మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘ఈ కాలమే’ పాటను ఇప్పుడు విన్నాను, పాట మంచి ఫీల్ గుడ్ పాటలాగా చాలా బాగుంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను. టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” చిత్రం నుంచి ఈ రోజు ‘ఈ కాలమే’ అనే పాటను దర్శకుడు మారుతి గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట నా చిత్రానికి ప్రాణం లాంటిది. ఇంతటి అద్భుతమైన పాటను స్వరపరిచిన మిజో జోసెఫ్ గారికి మరియు ఈ పాటను విడుదల చేసిన దర్శకుడు మారుతీ కి ధన్యవాదాలు. మా చిత్రంలోని పాటలు అని ఆదిత్య మ్యూజిక్ లో ఉన్నాయి, చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.

చిత్రం పేరు : నచ్చినవాడు

నటి నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు

పబ్లిసిటీ డిజైనర్ : అనిల్, సాయి

సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్

కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్

ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్

DOP : అనిరుద్

ఎడిటర్ : K.A.Y. పాపా రావు

అసోసియేట్ డైరెక్టర్ : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ (విజయ్ డిజి టెక్ )

కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి

సంగీతం – మెజ్జో జోసెఫ్

ప్రాజెక్ట్ మేనేజర్ – వినోద్ కావూరి

కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా

నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకటరత్నం

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News